THREE LOVE STORIES ENDS IN A TRAGIC WAY IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Love Story: రెండు రోజులు.. మూడు లవ్ స్టోరీలు.. అన్నింటికీ అనుకోని ముగింపు..
ఫ్రతీకాత్మక చిత్రం
Lovers: కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు. ప్రియుడు మోసం చేశాడనో.. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందనో యువత ఆత్మహత్య వరకు వెళ్తుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు లవ్ స్టోరీలు ఆత్మహత్యల వరకు వెళ్లాయి.
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన భాగం. యుక్తవయసులో ఆకర్షణగా మొదలయ్యే కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయి. కొన్ని లవ్ స్టోరీలకు మాత్రం మధ్యలోనే ఎండ్ కార్డ్ పడుతుంది. ఐతే పెళ్లి తర్వాత ప్రేమ అలాగే ఉంటుందా లేదా అంటే గట్టిగా చెప్పలేం. అలాగే కొన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు. ప్రియుడు మోసం చేశాడనో.. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందనో యువత ఆత్మహత్య వరకు వెళ్తుంది. రెండు రోజుల వ్యవధిలో మూడు లవ్ స్టోరీలు ఆత్మహత్యల వరకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లోని రాజమహేంద్రవరంలోని ఆదమ్మదిబ్బ ప్రాంతానికి చెందిన కె.చందు అనే యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు రామదాసుపేటకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు.
పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోయినా వారిని ఎదిరించిన చందు ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రామదాసుపేటలోనే కొత్తకాపురం పెట్టాడు. ఐతే ఆరు నెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. ఐతే శుక్రవారం రాత్రి ఏమైందో ఏమో తెలియదుగానీ తీవ్ర మనస్తాపం చెందిన చందు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భార్య విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉంటే జిల్లాలోని పెదపూడికి చందిన సాయిరామ్ అనే యువకుడు రామేశ్వరంకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమను అంగీకరించడంతో రెండు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణపాయం తప్పింది. ఐతే పోలీసులు మాత్రం యువకుడిపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
కాకినాడలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకంది. నగరంలోని జగన్నాథపురానికి చెందిన సంగాడి వీరబాబు అనే యువకుడు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి, వీరబాబు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ప్రియురాలిని తీసుకొని కోటిపల్లి వెళ్లాడు. ఐతే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను యానాంలోని బంధువుల ఇంటికి పంపేశారు. దీంతో ఆమెను కలవనేనన్న ఆందోళన, పెళ్లికాదేమోనన్న భయంతో ఇంటివెనుకున్న పాకలో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో యువత క్షణికావేశాలకు లోనే ఆత్మహత్యలు చేసుకోవద్దని పోలీసులు సూచించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.