విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..

బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: July 9, 2019, 7:08 AM IST
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున వంటలమామిడి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 37 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందగానే
పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు, మృతులు కాకినాడకు చెందినవారుగా గుర్తించినట్టు సమాచారం.


First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>