నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మ‌ృతి

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు  దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 18, 2019, 7:48 AM IST
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం:  ముగ్గురు యువకులు మ‌ృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:


నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు  దుర్మరణం చెందారు.  వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఆదివారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని, టిప్పర్‌ ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైయారు.  నెల్లూరుకు చెందిన రియాజ్‌(19), ఫయాజ్‌(21), శాన్‌వాజ్(16) ద్విచక్రవాహనంపై కణుపూరు వెళ్తుండగా.. వెంకటాచలం వైపు వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా సమీప బంధువులే కావడం విశాదకరం. కేసు దర్యాప్తులో ఉంది.


First published: February 18, 2019, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading