ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామాలు చేశారు. ఆ ముగ్గురు రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 153 జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, షేక్ హబీబ్, గెడ్డం సతీష్ బాబు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించాలంటూ అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ ముగ్గురు రాజీనామాలను ఆమోదిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా చేసిన ముగ్గురు న్యాయవాదుల్లో పెనుమాక వెంకట్రావు గవర్నమెంట్ సర్వీసెస్‌కు సంబంధించిన న్యాయపరమైన అంశాలను డీల్ చేస్తారు. షేక్ హబీబ్ సంక్షేమ పథకాలకు సంబంధించిన లీగల్ ఇష్యూలను డీల్ చేస్తారు. గెడ్డం సతీశ్ బాబు రవాణాకు సంబంధించిన అంశాలపై హైకోర్టులో ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తారు. మరోవైపు హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస షాక్‌లు తగులుతున్న వేళ ప్రభుత్వమే వారి చేత రాజీనామాలు చేయించినట్టు తెలుస్తోంది.
ముగ్గురు న్యాయవాదుల రాజీనాామాలు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.