Home /News /andhra-pradesh /

THREE DEAD AND OTHER INJURED IN ROAD ACCIDENTS OCCURRED IN ANDHRA PRADESH AND TELANGANA AK

రాజన్నను దర్శించుకుని వెళుతూ.. తిరిగిరాని లోకాలకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ, తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

    దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న ఆ కుటుంబంలోని కొందరు రోడ్డు ప్రమాదం బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేట గరికపాడు ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా మధిరలోని ఆత్కూరు గ్రామానికి చెందిన మాచర్ల శ్యామ్‌(60) కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

    ప్రమాద సమయంలో డ్రైవర్‌తో సహా కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మిగతావారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

    ఇక హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపురంలో జరిగిన మరో ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ లారీ.. దండుమల్కాపురం వద్ద ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ లారీ చక్రాల కింద ఇరుక్కుపోయింది. బైక్‌ను లారీ కొద్దిదూరం ఈడ్చుకు వెళ్లడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే లారీ మొత్తానికి వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొనే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Road Accident, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు