ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు

AP Assembly Elections 2019 : ఇప్పటి నుంచీ ప్రతీ గంటా కీలకమే అని భావిస్తున్న రాజకీయ పార్టీలు... ధనస్వామ్యానికి తెరతీసినట్లు తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 7, 2019, 6:21 AM IST
ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దాదాపు నెల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ పెట్టి... మనం ఊహించిందే చెప్పినప్పుడు... ఒకింత ఆశ్చర్యపోయి... గట్టిగా నెల రోజులే ఉంది... ఈ కాస్త సమయంలోనే పార్టీలు అభ్యర్థుల్ని ఎంపిక చెయ్యాలి, మేనిఫెస్టోలు రూపొందించాలి, ఎన్నికల ప్రచారం చెయ్యాలి... ఇవన్నీ పూర్తవుతాయా అని లెక్కలేసుకున్నాం. చూస్తుండగానే అన్నీ అయిపోయాయి... ఉగాది రోజున ప్రధాన పార్టీలు (టీడీపీ, వైసీపీ) మ్యానిఫెస్టోలు కూడా ప్రకటించేశాయి. ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో కలిపి ఇంకా మూడ్రోజులే మిగిలివుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు, ప్రచారాలు, రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు, చర్చా వేదికలు నిర్వహిస్తూ... ఓట్ల వేటలో తలముకలయ్యారు. ఇక ఆయా పార్టీల అధినేతల ప్రచారాలైతే మామూలుగా లేవు. గంటలు గంటలు ప్రసంగాలు చేస్తూ... ఇన్నాళ్లూ ఏం చేసిందీ ఓ పార్టీ చెబుతుంటే (టీడీపీ), తాము అధికారంలోకి వస్తే ఏం చెయ్యబోయేదీ (వైసీపీ) మరో పార్టీ చెబుతోంది. అటు తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్... సేఫ్ సైడ్‌లో కూల్‌గా ప్రచారం చేసుకుంటూ... వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలుచుకునే దిశగా కారు స్పీడులో జోరుగా ప్రచారం చేసుకుపోతోంది. ఇక రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ... పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటు ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే ఆవేశాన్ని, అదే దూకుడు ప్రసంగాలతో యువతను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలా పార్టీలన్నీ ఈ మూడు రోజుల్నీ ఎంతో కీలకమైన రోజులుగా భావిస్తున్నాయి.

నోట్ల కట్టల కలకలం : ఎన్నికలు జరిగేందుకు ఇంకా ఐదు రోజులే టైం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తనిఖీల్లో కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు లేకుంగా సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేస్తున్నారు. ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు రూ.1500 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మద్య ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది.

ఓవైపు కేంద్ర ప్రభుత్వం నల్ల ధనం లేకుండా చేస్తామనీ, పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతోంది. కానీ... రాజకీయ పార్టీలు, నేతలు మాత్రం విచ్చల విడిగా నల్లధనాన్ని ఖర్చు పెడుతున్నారు. అసలా డబ్బంతా వాళ్లకు ఎక్కడి నుంచీ వస్తోంది? ప్రభుత్వాలకు వస్తున్న ఆదాయాలు, ఖర్చుల వివరాల్ని ఎందుకు ప్రభుత్వ వెబ్ సైట్లలో పెట్టరు? ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సిన బాధ్యతను ఎందుకు గాలికొదిలేస్తున్నారని ఓటర్లు వేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానాలు లేవు. ఎన్నికలు రాగానే... ఇళ్లల్లో, గోడౌన్లలో ఇలా ఎక్కడెక్కడో దాచిన నల్ల ధనాన్ని బయటకు తీసి... సీక్రెట్‌గా పంచడం ప్రతి సారీ జరుగుతున్న తంతే.

డబ్బిస్తే ఓట్లు వేసేస్తారా : ఎన్నికల టైంలో దాదాపు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులూ ఓటర్లకు డబ్బులిస్తుంటారన్నది బహిరంగ రహస్యం. డబ్బు తీసుకునే ఓటర్లందరూ ఆయా పార్టీలకే ఓట్లు వేస్తారని చెప్పలేం. కాకపోతే... కొంతమంది ఓటర్లు మాత్రం... డబ్బు తీసుకున్నాం కాబట్టి... బాధ్యతగా ఆ పార్టీకే ఓటు వెయ్యాలి అన్న ఆలోచనకు వస్తుంటారు. సరిగ్గా అలాంటి ఓటర్లకు గాలం వేసేందుకే ఈ డబ్బు పంపిణీకి తెరతీస్తున్నాయి పార్టీలు. ప్రస్తుతం ఓటుకు రూ.1000 నుంచీ రూ.5000 దాకా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రజలు మాత్రం అంత సీన్ లేదనీ... ఓటుకు రూ.500 మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. మీడియా ఎక్కువ చేసి చెబుతోందనీ, ఎవరూ తమకు అంతంత డబ్బు ఇవ్వట్లేదనీ అంటున్నారు. ఏమైతేనేం... చట్ట విరుద్ధంగా డబ్బు, మద్యం పంపిణీ మాత్రం సాగుతోంది. 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంతటీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు... టీడీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే...

YSRCP Manifesto Highlights : వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే...

ఎన్నికల సభలకు వస్తున్న ప్రజల్లో నాలుగు రకాలు... మీరు ఏ టైపో తెలుసుకోండి...
First published: April 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు