తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం

తిరుపతిలో ఉండే గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు కిరీటాలను అలంకరిస్తారు. వాటిలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి.

news18-telugu
Updated: February 3, 2019, 11:46 AM IST
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం
తిరుమల బ్రహ్మోత్సవాలు
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉండే శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి. తిరుపతిలో ఉండే గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు కిరీటాలను అలంకరిస్తారు. వాటిలో మూడు కిరీటాలు మాయం అయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు విచారణ చేస్తున్నారు. ఉత్సవ మూర్తులకు అలంకరించే కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది. ఆలయంలో ఉండే సీసీటీవీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. గతంలో టీటీడీ పరిధిలో ఉండే శ్రీకోదండ రామస్వామి ఆలయంలో కిరీటాన్ని ఓ అర్చకుడు తాకట్టు పెట్టాడు. దీంతో అప్పట్లో అది సంచలనంగా మారింది. ఆ తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు గోవిందరాజ స్వామి ఆలయంలో ఏకంగా మూడు కిరీటాలు మాయం కావడం మరింత సంచలనంగా మారింది.

తిరుపతి శ్రీ గోవిందరాస్వామి ఆలయంలో కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవిలకు అలంకరించే మూడు కిరీటాలు మాయం అయ్యాయి. వాటిపై విచారణ జరుగుతోంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆలయాన్ని పరిశీలించారు. టీటీడీ జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ అన్బురాజన్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆలయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అర్చకుల మీదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కిరీటాలు పోయిన మాట వాస్తవమేనని ఎస్పీ అన్బురాజన్ ధ్రువీకరించారు. మూడు కిరీటాల బరువు సుమారు 1300 గ్రాములు ఉంటుందని తెలిపారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టీటీడీ సిబ్బందిని అందరినీ విచారించనున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి
First published: February 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>