news18-telugu
Updated: March 27, 2019, 4:15 AM IST
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో రాబోయో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి.. గుంటూరు జిల్లా బాపట్ల సీటు కోసం ఒకే పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు పోటి పడుతున్నారు. పవన్ కల్యాన్ పార్టీ జనసేన నుంచి ఏకంగా ముగ్గురు అభ్యర్థులు బాపట్ల సీటు కోసం నామినేషన్ ఫైల్ చేసారు. అయితే ఇద్దరు పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయగా.. మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వివరాల్లోకి వెళితే.. తొలుత రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్‌రెడ్డికి పార్టీ బి-ఫారం ఇచ్చింది. దీంతో ఆయన ఈ నెల 22న అట్టహాసంగా ..తన మద్దతుదారులతో ర్యాలీ తీసి.. నామినేషన్ వేశారు. కానీ ఆయనపై జనసేన కార్యకర్త లు కొందరు ఆరోపణలు చేయడంతో జనసేన నాయకుడు.. జేడీ లక్ష్మీనారాయణ సూచన మేరకు..ఆయనకు సన్నిహితుడైన ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత పవన్‌కు తెలిపారు. దీంతో జనసేన పార్టీ మధుసూదన్‌రెడ్డి బి-ఫారం రద్దు చేసింది. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అందజేశారు. ఆ తర్వాత సోమవారం లక్ష్మీనరసింహ జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలుచేశారు. మరోవైపు .. పార్టీ బి-ఫారం లేకపోయినా జనసేన అభ్యర్థిని నేనేనంటూ అదే ప్రాంతానికి చెందిన జనసేన నాయకుడు బీకే నాయుడు కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే పార్టీ తరుపున ముగ్గురు అభ్యర్థులు ఒకే సీటు కోసం నామినేషన్ వేసినట్లైంది.
Published by:
Suresh Rachamalla
First published:
March 27, 2019, 4:12 AM IST