హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap-BRS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

Ap-BRS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

తోట చంద్రశేఖర్‌ (image credit - Instagram)

తోట చంద్రశేఖర్‌ (image credit - Instagram)

జాతీయపార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అందులో భాగంగానే.. ముందుగా ఏపీలో విస్తరించేందుకు వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ నియమించారు. కాగా నేడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, పార్థసారధి సహా పలువురు ఏపి కీలక నేతలు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జాతీయపార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అందులో భాగంగానే.. ముందుగా ఏపీలో విస్తరించేందుకు వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ నియమించారు. కాగా నేడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, పార్థసారధి సహా పలువురు ఏపి కీలక నేతలు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు.

న్యూ ఇయర్ ఎఫెక్ట్..అక్కడకు క్యూ కట్టిన మందుబాబులు..ఎందుకో తెలుసా?

ఈ సందర్బంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సిట్టింగ్ లు తనకు కాల్ చేసి చేరుతామని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పెట్టింది దేశం కోసం. ఓ మూలకు ఉండడానికి కాదు. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. మహోజ్వలిత లక్ష్యం కోసమే బీఆర్ఎస్ ని పెట్టాం. లక్ష కిలోమీటర్లయినా ఒక్క అడుగుతోనే మొదలు అవుతుంది. బీఆర్ఎస్ తమాషా కాదని తనదైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. సహజత్వానికి దూరంగా ఇప్పటి న్యాయకత్వం ఉంది. ఏం చేసైనా సరే గెలవాలనే లక్ష్యంతో వెళ్లడం సరికాదు. దేశం ఇప్పుడు అలాంటి వ్యవస్త్రీకృత లోపాలున్నాయి. ఎమ్మెల్యే కాగానే కొమ్ములు వస్తున్నాయ్. ఎమ్మెల్యే అవ్వగానే వేషం, భాష మారుతున్నాయని కేసీఆర్ అన్నారు.

Vaikuntha Ekadashi: వెంకటేశ్వరస్వామికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి .. ఆ స్వర్ణ కిరీటం ఖరీదు ఎంతంటే..?

సంక్రాంతి తర్వాత ఏపీ BRS కార్యాలయం బిజీ బిజీ..

సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తుంది. ఈ యజ్ఞంలో ఏపీ ప్రజలు కూడా పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఇక తోట చంద్రశేఖర్ మీద పెద్ద బాధ్యత పెట్టాం. దానికి ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నానన్నారు. కాన్షిరాం భావజాలాన్ని బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి రావెల కిషోర్. దేశంలోని దళిత వర్గాల అవసరం గురించి ఆయనకు మంచి అవగాహనా ఉందని కేసీఆర్ అన్నారు.

మహారాష్ట్ర కేడర్‌ IASగా 23 ఏళ్ల పాటు పనిచేసిన చంద్రశేఖర్‌.. తన పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ (PRP) తరపున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019లో జనసేన పార్టీ తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన... ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ నియమించినట్టు తెలుస్తుంది.

First published:

Tags: Ap, AP News, BRS, CM KCR, Telangana

ఉత్తమ కథలు