THIS YEAR WHEN WILL WE CELEBRATE UGADI FESTIVAL EVER YEAR WHY THIS CONFUSION NGS
Ugadi 2022: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు..? పండుగలపై ఎందుకింత తర్జన భర్జన? పండితులు ఏం తేల్చారు..?
Ugadi Festival 2021: రాష్ట్రాల పేర్లు వేరైనా ప్రజలంతా ఒక్కటే... అలాగే పండుగల పేర్లు వేరైనా... పండుగలు ఒక్కటే. ముఖ్యంగా ఉగాది పండుగను దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. చిన్నపాటి తేడాలు ఉన్నా... మొత్తంగా అందరూ ఉగాది జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ... కర్ణాటక ప్రజలు ఇవాళ ఉగాదిని జరుపుకుంటారు. దీంతో కొత్త సంవత్సరం నేటి నుంచి ప్రారంభమైనట్లు భావిస్తారు. ఈ రోజున సంతోషంగా ఉంటే... సంవత్సరమంతా సంతోషంగా ఉంటాం అని భావిస్తారు. అదే సమయంలో తీపి, చేదు సహా షడ్రుచుల సంగమమైన ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ... జీవితంలో కూడా సంతోషాలు, కష్టాలూ అన్నీ కలగలిసి ఉంటాయనే సంకేతాన్ని ఇచ్చుకుంటారు. (image credit - twitter)
Ugadi 2022: తెలుగు రాష్ట్రాల్లో పండుగ విషయాల్లో ఎప్పుడు ఎదో ఒక గందరగోళం కనిపిస్తూనే ఉంది. పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అని తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఇప్పుడు మరోసారి ఉగాది పండుగ విషయంలో కన్ఫ్యూజ్ నెలకొంది.. మరి చివరికి పండితులు ఎలా డిసైడ్ చేశారు.. ఉగాది పండుగ ఎప్పుడు..?
Ugadi 2022: ఈ ఏడాది శుభకృతు నామ సంవత్సరంలోకి మనం అందరం అడుగుపెట్టబోతున్నాం.. అసలు ఉగాది పండుగ (Ugadi Cebrations)ఎలా జరుపుకుంటామంటే..? పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచే ఈ లోకం ప్రారంభమయ్యిందని శాస్త్రాలు చెబుతున్నాయి. వేదాలను హరించిన సోమకుడిని శ్రీ మహా విష్ణువు (Lord maha vishunuvu) మత్స్యవతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు. అంతేకాదు వేధాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ సందర్బంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది. అలాగే ఈ చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున నూతన జీవితానికి నాందిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం అని అర్థం. సృష్టి ఆరంభమైనదని కూడా అర్థం వస్తుంది. అలాగే యుగం అంటే జంట, లేదా ద్వయం అని అర్థం వస్తుంది. ఈ యుగానికి ఆది (ప్రారంభం)గా ఈ ఉగాది పండుగను జరుపుకుంటామని పండితులు చెబుతున్నారు. దీంతోపాటు ఉగాది స్పెషల్ పచ్చడి (Ugadi Pachadi)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. షడ్రుచుల సమ్మేళనంగా తయారుచేసే ఈ పచ్చడి జీవింలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలను, ఘటనలను సూచిస్తుంది. మనకు ఎదురయ్యే అనుభవాల సారాంశాన్ని ఈ పచ్చడి మనకు వివరిస్తుందన్న మాట.
ప్రతి ఏడాదీ ఏదో పండగ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో తర్జనభర్జన తప్పడం లేదు. పండగ ఏ రోజు జరుపుకోవాలంటే పంచాగకర్తలది తలోమాట అవుతోంది. ముఖ్యంగా మన తెలుగు పండుగ అయితే ఉగాది విషయంలో మాత్రం గందరగోళం తప్పడం లేదు. అయితే ఆ సమస్య రాకుండా పంచాంగకర్తలు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? అంటే.. ఏపీలో పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భవించింది. కొత్తూరు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భావ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామిజీ, రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి హాజరయ్యారు. రాష్ట్రంలోని పంచాంగకర్తలు పాల్గొన్నారు. పండగ దినాలపై పంచాంగం విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించుకునేందుకు పంచాంగకర్తలు సమాఖ్యగా ఏర్పడ్డారు.
పండగల విషయంలో గందరగోళం లేకుండా.. భవిష్యత్తులో ప్రజలను గందరగోళంలోకి తీసుకెళ్లకూడదని స్వాత్మానందేంద్ర స్వామిజీ చెప్పారు. పంచాంగకర్తల సమాఖ్య ఏర్పడటం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. పంచాంగం విషయంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదు. పంచాంగకర్తలు ఒకే తాటిపైకి రావడంతో సమస్యలు పరిష్కారమవుతాయని లక్ష్మీపార్వతి అన్నారు. త్వరలో పంచాంగకర్తలను తెలుగు అకాడమీ సన్మానిస్తుందని చెప్పారు.
పురాణాల్లో అంతర్గతంగా ఉండే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు అభిప్రాయపడ్డారు. పురాణాల్లోని సైన్స్‌ను ముందు తరాలకు వివరించాలి. ప్రాచీన విజ్ఞానాన్ని కాపాడుకోవాలన్నారు. గతంలో పలు సందర్భాల్లో ఏదో పండగ రోజుపై సందిగ్ధం ఏర్పడడాన్ని చూశాం. ఫలానా పండగ రేపా ఎల్లుండా అనే క్వశ్చన్ అందరి నోటా వినిపించేది. కొందరు పంచాంగకర్తలు రేపంటే ఇంకొందరు ఎల్లుండే పండుగ అనేవారు. ఎవరి పద్ధతి వారిదైనా ప్రజల్లో అయోమయం నెలకొనేది అని ఆవేదన వ్యక్తం చేశారు.
పండగకు సెలవు ఎప్పుడో చివరి వరకు తేలేది కాదు. గతంలో ఎదుర్కొన్న ఈ సమస్యలపై పంచాంగకర్తలు చర్చించారు. దీన్ని పరిష్కరించడానికి చేయడానికి పంచాంగకర్తల సమాఖ్య ఆవిర్భవించింది. ఇది శుభ పరిణామమని పండితులు అంటున్నారు. పండగ తిథి, ఘడియలపై ముందే క్లియర్‌గా ప్రజలకు తెలుస్తుంది. పండగలపై పంచాయితీ తీర్చే పంచాంగంతో అనవసర సమస్యలు తప్పుతాయని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ఉగాదిని ఏప్రిల్ 2 శనివారంగా నిర్ణయించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.