ఆ కుర్రాడి బెల్లీ డ్యాన్స్ అదుర్స్.. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోకుండా..

విజయవాడకు చెందిన శ్రవణ్ కుమార్(25) అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఓరోజు యూట్యూబ్‌లో మెహర్ మాలిక్ బెల్లీ డ్యాన్స్ చూసి ఫిదా అయ్యాడు.తెలియకుండానే ఆ కళపై ఇష్టం పెంచుకున్న శ్రవణ్.. అందులో రాణించాలని నిర్ణయించుకున్నాడు.

news18-telugu
Updated: July 17, 2019, 1:14 PM IST
ఆ కుర్రాడి బెల్లీ డ్యాన్స్ అదుర్స్.. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోకుండా..
బెల్లీ డ్యాన్సర్ శ్రవణ్
  • Share this:
బెల్లీ డ్యాన్స్.. నడుమును వయ్యారంగా గింగిరాలు తిప్పే ఈ కళ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. అయితే బెల్లీ డ్యాన్స్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది అమ్మాయిలే. సహజంగానే అమ్మాయిల పట్ల ఉండే ఆకర్షణ కారణంగా.. వారు చేసే బెల్లీ డ్యాన్స్ చూసేవాళ్లకు ఒకలాంటి కిక్ ఇస్తుంది.మరి, అదే బెల్లీ డ్యాన్స్ అబ్బాయి చేస్తే..? కాస్త తేడాగా చూడటం ఖాయం. ఎగతాళి చేసేవాళ్లకు,హేళన చేసేవాళ్లకు కొదువ ఉండదు. అయితే ఎవరేమనుకుంటే నాకేంటి అనుకున్న ఓ యువకుడు
తనకు నచ్చిన బెల్లీ డ్యాన్స్ కళలో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

విజయవాడకు చెందిన శ్రవణ్ కుమార్(25) అనే యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఓరోజు యూట్యూబ్‌లో మెహర్ మాలిక్ బెల్లీ డ్యాన్స్ చూసి ఫిదా అయ్యాడు.తెలియకుండానే ఆ కళపై ఇష్టం పెంచుకున్న శ్రవణ్.. అందులో రాణించాలని నిర్ణయించుకున్నాడు. బంధువుల ఎగతాళి, హేళనలను లెక్క చేయకుండా దానిపై సీరియస్‌గా దృష్టి పెట్టాడు. ఇందుకోసం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ అకాడమీలో చేరాడు.అక్కడే ఇషాన్ హిలాల్ అనే మరో బెల్లీ డ్యాన్సర్‌ అతనికి పరిచయమయ్యాడు. దీంతో తన లాగే బెల్లీ డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్న అబ్బాయిలు కూడా ఉన్నారని తెలుసుకున్నాడు.

మొత్తానికి అనుకున్నట్టుగానే శ్రవణ్ బెల్లీ డ్యాన్సర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నాడు. కళకు లింగం బేధం లేదని.. భరతనాట్యం,కూచిపూడి లాగే ఇది కూడా ఓ కళ అని శ్రవణ్ చెబుతున్నాడు.బెల్లీ డ్యాన్స్ అంటే అశ్లీల నృత్యం అనే అభిప్రాయం చాలామందిలో ఉందని... అది సరికాదని శ్రవణ్ అంటున్నాడు. ఇది కేవలం మహిళలకు సంబంధించిన కళ మాత్రమే కాదని.. ఎవరైనా సాధన చేయవచ్చునని చెబుతున్నాడు. ఆరోగ్యపరంగానూ బెల్లీ డ్యాన్స్ చాలా మంచిదని,గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు బెల్లీ డ్యాన్స్ చేయాలని సలహా ఇస్తారని చెప్పాడు.


First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>