THIS TIME AP ASSEMBLY HAS 70 NEW MLAS FROM TDP AND YCP NK
అప్పట్లో వైసీపీకి 67 మంది ఎమ్మెల్యేలు... ఇప్పుడు 67 మంది కొత్త ఎమ్మెల్యేలు...
వైఎస్ జగన్
Andhra Pradesh Assembly : చంద్రబాబు ఎక్కువ మంది సిట్టింగులకే టికెట్లు ఇవ్వగా, జగన్... కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఫలితంగా ఎక్కువ మంది కొత్తవారు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి అనేక కారణాల్లో ఒకటి ఎక్కువ మంది సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇవ్వడం. తెలంగాణలో కేసీఆర్ ఎలాగైతే, సిట్టింగులనే మళ్లీ రంగంలోకి దింపి భారీ విజయం సాధించారో, అలాగే ఏపీలో తానూ భారీ విజయం సాధిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలేసుకున్నారేమో. బట్... సిట్టింగులకే టికెట్లు ఇవ్వడం, టీడీపీ గెలిచినవి 23 సీట్లు మాత్రమే కావడంతో... ఆ పార్టీ నుంచీ ఈసారి ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. వారు... గుంటూరు పశ్చిమ స్థానంలో గెలిచిన మద్దాళి గిరిధర్, రాజమహేంద్రవరం అర్బన్ నుంచీ ఆదిరెడ్డి భవాని, ఉండి నుంచీ రామరాజు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.
2014లో 67 మందితో అసెంబ్లీలో అడుగుపెట్టిన వైసీపీ... ఈసారి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో... మొత్తం 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆ పార్టీ నుంచీ 67 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. వైసీపీ నుంచీ ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, గూడురు ఎమ్మెల్యే వి.వరప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి... ఇతర సభల్లో చేసిన వారే. వి.వరప్రసాద్, అనంత వెంకట్రామిరెడ్డి ఎంపీలుగా పనిచెయ్యగా... శిల్పా చక్రపాణిరెడ్డి ఇదివరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. అసెంబ్లీకి మాత్రం ఇదే తొలిసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.