Missing Girl Identified: నేను శానిటైజర్ (Sanitizer) తాగాను.. ఇక అందిరికీ బై బై అని చెప్పింది.. అంతేకాదు ముందు రోజు తన స్నేహితలను (Friends) కలిసి.. అందరికీ బహుమానాలు (Gifts) ఇచ్చింది.. తనను అందరూ గుర్తొంచుకోండి అంటూ జాగ్రత్తలు చెప్పింది. కానీ ఎందుకు అలా చేస్తోందో ఎవరూ ఊహించలేకపోయారు.. కానీ మరుచటి రోజు స్కూల్ బ్లాక్ బోర్డుపై చూసి.. షాక్ అయ్యారు.. వెంటనే విషయం ప్రిన్సిపాల్ కు చెప్పడంతో.. చుట్టుపక్కల వెతికి.. చివరికి పోలీసులకు.. తల్లిదండ్రులకు (Parents) సమాచారం అందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా (Srikakulam District).. టెక్కలిలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం అదృశ్యమైన పదో తరగతి బాలిక మిస్టరీ వీడింది. స్కూలు నుంచి బయటకు వెళ్లిపోయిన ఆ విద్యార్థినిని టెక్కలి పోలీసులు సురక్షితంగా ఆమె కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. పోలీసు స్టేషన్లో దళిత సంఘాల ప్రతినిధులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సమక్షంలో ఎస్సై కామేశ్వరరావు బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. అసలు ఆమె ఎందుకు అలా బ్లాక్ బోర్డుపై రాయాల్సి వచ్చింది. ఎందుకు స్కూల్ వదిలి బయటకు వెళ్లిపోయింది..
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టెక్కలిలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే ఏమైందో ఏమో కానీ.. తాను శానిటైజర్ తాగాను అని.. ఇక అందరికీ బై అంటూ తరగతి గది బోర్డుపై రాసి కనిపించకుండా పోయింది. అయితే బాలిక మిస్సింగ్ కు.. పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బంధువులకు ఫోన్ చేసిన విద్యార్థిని.. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ జరపగా చివరికి బాలిక ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమైంది. ఆమె అలా బయటకు వెళ్లడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని తెలిసింది.. వారిద్దరి తీరుతో తీవ్రంగా కలత చెంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
ఇదీ చదవండి : సర్కార్ పై బాలయ్య సమర శంఖం.. నేడు హిందూపురంలో మౌన దీక్ష
కోటబొమ్మాళి మండలంలోని కురుడుకు చెందిన బాలిక తల్లిదండ్రులు భారతి, సింహాచలం మనస్పర్ధలతో 14 ఏళ్ల కిందట విడిపోయారు. తండ్రి మద్యం తాగడం, తల్లి అందుబాటులో లేకపోవడంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమె తల్లి గతంలో ఆమదాలవలసలో ఉండేదని, ఆమెను వెతుక్కుంటూ బాలిక వెళ్లడంతో అదే ఇంట్లో ఉన్న మహిళ బాలికను చేరదీసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను టెక్కలికి తీసుకువచ్చి తండ్రి, బంధువులకు అప్పగించారు. బాలిక ఆచూకీ తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam