THIS RAILWAY STATION IS EXCLUSIVELY FOR WOMAN RUNNING SUCCESSFULLY FOR FOUR YEARS FULL DETAILS HERE PRN TPT
Women’s Day Special: ఈ రైల్వే స్టేషన్ లేడీస్ స్పెషల్.. అక్కడ అందరూ మహిళలే..!
చంద్రగిరి రైల్వే స్టేషన్
Women’s Day: స్త్రీ లేనిదే సమాజం ముందుకు కదలదు. ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో మహిళల పాత్ర కీలకం. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపుతుంది. అందుకే సమాజంలో స్త్రీకి సమాన గౌరవం దక్కాలని ప్రతి ఒక్కరూ కోలుకుంటారు.
స్త్రీ లేనిదే సమాజం ముందుకు కదలదు. ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో మహిళల పాత్ర కీలకం. తల్లిగా, చెల్లిగా, భార్యగా, కుమార్తెగా అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపుతుంది. అందుకే సమాజంలో స్త్రీకి సమాన గౌరవం దక్కాలని ప్రతి ఒక్కరూ కోలుకుంటారు. స్త్రీలకు సమాన గౌరవం, వారిలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. ఏకంగా లేడీస్ స్పెషల్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది. నాలుగేళ్లుగా ఈ స్టేషన్లో స్టేషన్ సూపరింటెడెంట్ మొదలు.. కీ మెన్ వరకు అన్ని స్థాయిల్లో బాధ్యతలు చేపట్టిన అతివలు తమ పనితనంతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందడంతో పాటుగా మెరుగైన సేవలు అందిస్తోంది చిత్తూరు జిల్లా (Chittoor District) లోని చంద్రగిరి రైల్వేస్టేషన్
2018 మార్చి 6వ తేదీన రైల్వే శాఖ మహిళలతో ఏర్పాటు చేసిన ఈ రైల్వేస్టేషన్, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా రైల్వేస్టేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న రైల్వే స్టేషనులో పూర్తి స్ధాయిలో మహిళలే భాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలకమైన ఆపరేషన్ విభాగంతో పాటు కమర్షియల్ సిగ్నలింగ్ వంటి పలు విభాగాల్లో విధులు మహిళలే నిర్వర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో అంతా మహిళలే నియమించినా గత నాలుగేళ్లలో ఒక్క చిన్నపొరబాటు కూడా చోటు చేసుకోలేదు. అంతేకాదు అందరూ సమిష్టిగా పనిచేసి పలు అవార్డులు కడా సొంతం చేసుకున్నారు.
రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ గా లలితా ఉషారాణి, అసిస్టెంట్ సూపరింటెండెంట్లుగా నిర్మలా, పద్మా, బిశ్వాసిలు పనిచేతుండగా.. వీరికి సహాయక సిబ్బందిగా శ్యామలా, ఉమామహేశ్వరీ, సుజాతాలు ఉన్నారు.. ఇద్దరు ఆర్.పి.ఏఫ్. మహిళా పోలీసులు స్టేషను భధ్రతను, ప్రయాణికుల భధ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూంటారు. బిజీ టైమ్ లో కూడా ఎలాంటి ఒత్తిడీ లేకుండా వీళ్లంతా సమిష్టిగా పనిచేస్తున్నారు.
తమకు ఇచ్చిన ఈ భాధ్యతను ఎంతో ఇష్టంగా చేసుతున్నామని.. నాలుగేళ్లలో ఎలాంటి ఫిర్యాదులుగానీ, నిర్లక్ష్యం వహించిన ఘటనలను గానీ చోటు చేసుకోలేదని ఇక్కడి ఉద్యోగినులంటున్నారు. రైల్వేస్టేషన్ లో విధులు నిర్వర్తించే మహిళలు అందరూ ఒకే కుటుంబ సభ్యులు లాగా కలిసి మెలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తోటి మహిళలతో కలిసి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పని చేయడం తమకు ఎంతగానో తృప్తిని కలుగజేస్తోందని అంటున్నారు.
రైల్వేస్టేషన్ కాంట్రాక్టు కార్మికురాలు మాట్లాడుతూ.. గతంలో నేను చిత్తూరులో పని చేసే దాన్ని, చిత్తూరు నుండి చంద్రగిరి రైల్వేస్టేషన్ వరకూ ప్రయాణించినా తమకు ఎటువండి ఒత్తిడి లేదు..పై స్ధాయి అధికారులు అందరూ మహిళలే కావడంతో వారు ఇచ్చే జీతం కన్నా ఈ మహిళా రైల్వే స్టేషను లో పని చేయడం చాలా ఆనందంగా ఉందని కాంట్రాక్టు కార్మికురాలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.