అంతేకాదు అప్పటివరకు హాయిగా ఉన్న జీవితం ఒక్కసారి తలక్రిందులైంది. నిర్వేదంలో తన గురించి తానే పట్టించుకోవడం మానేశాడు. సరైన తిండిలేక ముఖంలో జీవం పోయింది. సరే జరిగిందేదో జరిగిపోయిందని.. అన్నీ వదిలేసి.. సైకిల్ పై బట్టల వ్యాపారం చేద్దామనుకుంటే.. ఆయన రూపం చూసి ఎవరూ కొనేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. దీంతో తినడానికి తిండిలేక కాలే కడుపు నింపుకోవడానికి యాచించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన ఇంతటి విద్యావంతుడా అంటే ఎవరూ నమ్మేవారు కూడా కాదు, గ్రామంలో బాగా తెలిసిన వాళ్లకే కేదరాశ్వేరరావు గురించి తెలుసు.
ఇది చదవండి: ప్లీనరీలో జగన్ చేసే ప్రకటన ఇదేనా..? ఆ నేతలకు షాక్ తప్పదా..? వైసీపీలో జోరుగా చర్చ..
అలాంటిది ఇప్పుడు అంటే ఆయన డీఎస్సీకి క్వాలిఫై అయిన తర్వాత 24 ఏళ్లకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. అంటే గట్టిగా పదేళ్లు కూడా ఉద్యోగం చేయకుండానే రిటైర్ అవ్వావ్సిన పరిస్థితి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆయనకు ఉద్యోగం వచ్చిన ఆయనకే తెలియదు. స్థానికంగా ఉండే కొందరు యువకులు తమ మొబైల్స్ లో చెక్ చేసి చెప్పిన తర్వాతే ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది.
ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని.. వెళ్లి ఉద్యోగంలో చేరుతానంటూ అమాయకంగా చెబుతున్నారు కేదారేశ్వరారవు. నిజానికి ఆయన ముఖంలో ఇప్పటికైనా న్యాయం జరిగిందనే సంతోషం కూడా కనిపించని పరిస్థితి. ఎందుకంటే డీఎస్సీ వివాదం వల్ల ఆయన జీవితాన్ని కోల్పోయాడు. ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికాలేదు. ఒంటరిగా మిగిలిపోయాడు. అందరి మాదిరిగానే అప్పుడే ఉద్యోగం వచ్చి ఉంటే ఈపాటికి నెలకు దాదాపు లక్ష రూపాయల జీతం తీసుకుంటూ., మంచి డూప్లెక్స్ ఇల్లు, పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటూ హాయిగా కారులో తిరుగుతూ ఉండేవాడు. కానీ ఏం చేస్తాం.. చదువున్నా చిన్నపాటి వివాదం ఆయన జీవితాన్ని తలకదులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Srikakulam, Teacher jobs