CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) కు ప్రజలు ఇచ్చిన మార్కులు ఎన్ని..? సీఎంగా ఆయనకు ఎంత శాతం మంది మద్దతు తెలుపుతున్నారు.. ఓవరాల్ గా ప్రభుత్వం పని తీరుకు జనం ఇచ్చే మార్కులు ఎన్ని..? ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు కారణం ఏంటి..? అసలు సీఎ జగన్ చేయించిన సర్వేల్లో ప్రజలు ఎలాంటి అభిప్రాయం చెప్పారు. పార్టీ కీలక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు అర్థం అదేనా.. మరి గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి.. నిజంగానే వారిపై వేటు వేయడానికి సిద్ధమయ్యారా..? ఓ వైపు ఎమ్మెల్యేల గ్రాఫ్ 40 శాతమే ఉందని చెప్పిన ఆయన.. 175 సీట్లు నెగ్గలేమా అని ప్రశ్నించడం వెనుక అర్థం ఏంటి..? ఎమ్మెల్యేల గ్రాఫ్ తక్కువ ఉందంటూ అసహనం వ్యక్తం చేస్తూనే.. 175 మన టార్గెట్ అని ఎలా చెప్పారు..? అసలు ఇంతకీ సర్వేలు ఏం తేల్చాయి..?
పార్టీ సమావేశంలో సీఎం జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. ఎమ్మెల్యేకు 40 శాతం గ్రాఫ్.. సీఎంకు 60 శాతం గ్రాఫ్ ఉన్నట్టు చెప్పారు. అయితే వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చాలామంది ఎమ్మెల్యేల గ్రాఫ్.. 10 నుంచి15 శాతం మంది తక్కువ స్థాయిలో ఉన్నారని తెలుస్తోంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలు మధ్య స్థాయిలో ఉన్నారని వెల్లడించారు. సీఎం లెక్కల ప్రకారం దాదాపుగా 50-60 మంది వరకు మధ్య స్థాయిలో పని తీరు ప్రదర్శిస్తున్నట్లుగా సర్వేలో తేలిందని సమాచారం. ముఖ్యంగా 20-24 మంది వరకు తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అందరికీ కలిసి క్లాస్ పీకినా.. త్వరలో వీరితో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని.. ముఖ్యంగా తక్కువ, మధ్య స్థాయి ఎమ్మెల్యేలు 'గడప గడపకు' పూర్తిగా తిరగడం ద్వారా వారి గ్రాఫ్‌ను పెంచుకోవాని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
ఇదీ చదవండి : తెలంగాణ సీఎంగా జగన్..? కేటీఆర్ కు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్
ఇందులో భాగంగా మే నుంచి గేర్ మార్చాలని సీఎం భావిస్తున్నారు. అందుకే ఎన్నికలకు ఇప్పటి నుంచే సరైన అడుగులేస్తేనే మళ్లీ అధికారంలో కొనసాగుతామన్నది జగన్ లెక్క.. అందులోనూ సీఎంగా తన గ్రాఫ్ 60 శాతం ఉండడం అడ్వాంటేజ్ అని.. ఆ ప్రభావం అందరి ఎమ్మెల్యేలపైనా కచ్చితంగా ఉంటుంది అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ-పార్టీ పని తీరు గురించి సర్వేల ద్వారా సేకరించిన సమచారంలో.. ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత తక్కువ ఉందని.. కొందరి ఎమ్మెల్యేల తీరుపైనా పూర్తి వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయన్నది వైసీపీ వర్గాల టాక్.
ఇదీ చదవండి : మళ్లీ మంట పెడుతున్న టమాటా..? బహిరంగ మార్కెట్లో ధర చూస్తే కళ్లు తిరగాల్సిందే..?
సీఎంగా జగన్ ఉండాలన్నది 65 శాతం మంది ప్రజలు కొరుకుంటున్నారని ఆ సర్వేల్లో తేలింది అంటున్నారు. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఆ శాతం 40 కన్నా తక్కువగా ఉండడంతో పార్టీకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజలకు దూరంగా ఉంటున్నారనేది తేలిందని... ఇప్పుడు దానిని సరిదిద్దుకొనే సమయం దొరికిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్లకపోతే వారి గ్రాఫ్ మరింత పడిపోతుందని అందుకే అలర్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. వైసీపీ గడప గడపకు తరువాత కూడా వారి గ్రాఫ్ పెరగకపోతే.. ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని సీఎం స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News