సగం ధరకే తిరుమల లడ్డూప్రసాదం.. అన్ని జిల్లాలో కేంద్రాల్లో అందుబాటులో..

భ‌క్తుల అభ్య‌ర్థ‌న‌లు పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50 ల‌డ్డూను రూ.25కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించారు. జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ ‌మండ‌పాల్లో 15 వేల నుంచి 20 వేల ల‌డ్డూల‌ను ఉంచ‌నున్న‌ారు.

news18-telugu
Updated: May 23, 2020, 6:22 PM IST
సగం ధరకే తిరుమల లడ్డూప్రసాదం.. అన్ని జిల్లాలో కేంద్రాల్లో అందుబాటులో..
పూర్తిస్థాయిలో దర్శనాలు ప్రారంభమైతే... బయట ప్రాంతాల్లో లడ్డూలు అమ్మకాలు ఉండవని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
  • Share this:
ఇల వైకుంఠంగా పిలిచే తిరుమ‌ల పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా భ‌క్తుల‌కు తిరుమల‌ శ్రీవారి ద‌ర్శ‌నాన్ని దాదాపు 60 రోజులుగా నిలిపివేశారు. తిరిగి భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్య‌లో భక్తులు ఇ-మెయిల్‌, వాట్స‌ప్‌, ఫోన్ల‌ల ద్వారా  తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని విజ్ఞప్తులు వచ్చాయి.  భ‌క్తుల అభ్య‌ర్థ‌న‌లు పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50 ల‌డ్డూను రూ.25కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో 15 వేల నుంచి 20 వేల ల‌డ్డూల‌ను ఉంచ‌నున్న‌ారు.

క‌ల్యాణ‌ మండ‌పాల్లోని టిటిడి ఉద్యోగులు, హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు, పోలీస్‌, రెవెన్యూ అధికారుల స‌మ‌న్వ‌యంతో  భౌతిక దూరం పాటిస్తూ భ‌క్తుల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో 25వ తేదీ సోమ‌వారం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ క‌ల్యాణ‌ మండ‌పాల్లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో ఏవి ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుంచి రాష్ట్రంలోని వివిధ‌ జిల్లాల‌కు ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను తీసుకు వెళ్లే లారీల‌ను శ‌నివారం ఉద‌యం ఆయ‌న ప్రారంభించారు. అదేవిధంగా శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం ల‌డ్డూను స్వామివారి క‌ల్యాణంలో నివేదించేందుకు అవ‌స‌ర‌మైన ల‌డ్డూల‌ను మాత్ర‌మే త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు.

జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌ మండ‌పాల్లో చిన్న ల‌డ్డూల‌ను మాత్ర‌మే పంపీణి చేస్తున్నామ‌న్నారు. శ‌నివారం ఉద‌యం శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌పట్నం, గుంటూరు, కృష్ణా, తూర్పు, ప‌శ్చిప గోదావ‌రి జిల్లాల‌కు రెండు‌ లారీల‌లో ల‌డ్డూ ప్ర‌సాదాలు బ‌య‌లు దేరిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా ఆదివారం నాటికి రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు తిరుమ‌ల నుంచి ల‌డ్డూ ప్ర‌సాదాలు చేరుతాయ‌న్నారు. అంత‌కుముందు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో నాద‌నీరాజ‌నం వేదిక‌పై ‘యోగ‌వాశిస్టం - శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం’ పారాయ‌ణంలో భాగంగా 44వ రోజైన శ‌నివారం ఉద‌యం  అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం రోహిణి న‌క్ష‌త్రం పుర‌స్క‌రించుకుని ఆయ‌న గోపూజ నిర్వ‌హించారు.
First published: May 23, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading