చంద్రబాబు మీటింగ్‌లో దొంగలు పడ్డారు...

నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన మీటింగ్‌లో దొంగలు పడ్డారు. తమ చేతివాటం ప్రదర్శించి సుమారు 20 మంది పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేశారు.

news18-telugu
Updated: November 8, 2019, 8:43 PM IST
చంద్రబాబు మీటింగ్‌లో దొంగలు పడ్డారు...
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సమీక్ష సమావేశానికి హాజరైన కార్యకర్తలు
  • Share this:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన మీటింగ్‌లో దొంగలు పడ్డారు. తమ చేతివాటం ప్రదర్శించి సుమారు 20 మంది పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో వైసీపీ బాధితులతో మాట్లాడారు. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేడర్‌ను సమాయత్తం చేశారు. ఈ సమావేశాలకు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, సందట్లో సడేమియా అన్నట్టుగా కొందరు నేతలు, కార్యకర్తల పర్సులను దొంగలు కొట్టేసినట్టు తెలిసింది. సుమారు 20 మంది వరకు తమ పర్సులు పోగొట్టుకున్నారు. మరికొందరి మొబైల్ ఫోన్లు కూడా పోయాయి. టీఎన్ఎస్ఎఫ్ నేత రవినాయుడుకు చెందిన పర్సు కూడా పోయింది. ఇంత మంది పర్సులు, మొబైల్స్ పోయినా కూడా ఏ ఒక్క దృశ్యం కూడా అక్కడున్న సీసీ కెమెరాల కంట పడకపోవడం విశేషం. చంద్రబాబు సమీక్షా సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కి కనెక్ట్ చేశారు. అయితే, అందులోకూడా ఒక్క దొంగ చేతివాటం కూడా రికార్డ్ కాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కూడా మౌనంగా ఉంటున్నారు.
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading