హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP PRC Report : 14.29 శాతం ఫిట్‌మెంట్‌.. 72 గంటల్లో నిర్ణయం.. ఉద్యోగ సంఘాల పెదవి విరుపు

AP PRC Report : 14.29 శాతం ఫిట్‌మెంట్‌.. 72 గంటల్లో నిర్ణయం.. ఉద్యోగ సంఘాల పెదవి విరుపు

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

AP PRC Report : ఉద్యోగులు ఎప్పుడా ఎప్పుడా ఆని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నివేదిక బయటకు వచ్చింది. 72 గంటల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్ ఎలా ఉన్న ప్రస్తు కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ కే పరిమితం అయ్యింది. దీనిపై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సీఎం జగన్ తో నేరుగా భేటీలో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి.

ఇంకా చదవండి ...

AP CM Jagan on PRC:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతన సవరణ    కొలిక్కి తెచ్చింది.  ఉద్యోగులు కోరుతున్న విధంగా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై  పూర్తి నివేదికి ప్రస్తుతం  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికే ఆ   శుభవార్తను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉద్యోగ సంఘాలకు చెప్పింది.  ఇక పీఆర్సీ నివేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని  సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sarma) స్పష్టం చేశారు.

సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణలు సీఎంకు పీ ఆర్సీ నివేదికను అందచేశారు.   తరువాత సమీర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ…. ఫిట్ మెంట్ పై ముఖ్యమంత్రికి 7 ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు.

ఇదీ చదవండి : ఆ జిల్లాలో విజృంభిస్తోన్న అతిసార.. నలుగురు మృతి.. ఆస్పత్రిలో 60 మంది

వివిధ రాష్ట్రాలు ఆచరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి, సెంట్రల్ పే కమీషన్ రూల్స్‌ను ఫాలో అవుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ అంశాలపై గడిచిన 30 ఏళ్లలో రూపోందించిన పీఆర్సీ నివేదికలను కూడా పరిశీలించినట్లు చెప్పారు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 8 వేల కోట్ల రూపాయల నుంచి 10 వేల కోట్ల మేర అదనపు భారం పడనుందన్నారు. ఈ నివేదికలోనే విలేజ్ సెక్రటరీలు, హోం గార్డులు, అవుట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగుల గురించి కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. 2018 నుంచి పీఆర్సీ అమలవుతుందని.. నివేదికను ఉద్యోగ సంఘాలకు అందచేస్తామని…ఫైనాన్స్ శాఖ వెబ్ సైట్ లోనూ నివేదిక ఉందని సమీర్ శర్మ చెప్పారు.

ఇదీ చదవండి : బాబోయ్ ఇదేం బుద్ధి.. భార్య స్థానంలో వచ్చిన భర్త.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు

సీఎస్ సమీర్ శర్మ వెల్లడించిన అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విరిచారు. తాము గడిచిన రెండేళ్లుగా 71 డిమాండ్లను ప్రభుత్వానికి అందచేస్తే వాటిలో కేవలం కొన్నిటినే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పీఆర్సీ పూర్తి నివేదిక చదివిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వ్యాఖ్యలు ఎలా ఉన్న నేరుగా సీఎం జనగ్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతారు కాబట్టే.. ఆయన దగ్గరే పంచాయితీ తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం.

ఇదీ చదవండి : బొప్పాయి పండులో ఆకట్టుకుంటున్న బుల్లి గణపతి.. మండపం పెట్టి పూజిస్తున్న భక్తులు

పీఆర్సీపై సీఎస్‌ కమిటీ నివేదికలో ముఖ్య అంశాలు

ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన సీఎస్‌ కమిటీ

11వ వేతన సంఘం సిఫార్సులపై నివేదిక ఇచ్చిన సీఎస్‌ కమిటీ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు అంశాలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ

ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ

2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుంది.

2018 –19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం అయితే, 2020–21 నాటికి అది 111 శాతానికి చేరుకుంది.

ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే, 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో 31 శాతం, ఒడిశా 29శాతం, మధ్యప్రదేశ్‌ 28 శాతం, హరియాణ 23 శాతం

http://telugucms.news18.com/wp-login.php?loggedout=true

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News

ఉత్తమ కథలు