ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే...

2 గంటల 15 నిమిషాలు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక అంశాల్ని చర్చించారు.

news18-telugu
Updated: December 27, 2019, 2:35 PM IST
ఏపీ కేబినెట్‌ సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే...
Video : ఏసీబీపై సీఎం జగన్ ఆగ్రహం... డెడ్‌లైన్ విధింపు
  • Share this:
ఏపీ రాజధాని అంశమే కీలక అజెండాగా సమావేశమైన ఏపీ మంత్రివర్గం... కొన్ని కీలక అంశాలపై చర్చించింది. ప్రధానంగా... త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్ని 2011 జనాభా గణన ఆధారంగా నిర్వహించనున్నారు. 108 సర్వీసుల్ని బలోపేతం చేసేందుకు... 412 కొత్త 108 వాహనాల్ని కొనబోతున్నారు. మార్చి 30లోపు వాటిని కొనబోతున్నారు. అలాగే 104 సేవల కోసం 621 కొత్త వాహనాల్ని కొనబోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కొత్త విధానాన్ని ఆమెదించారు. 341 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్చబోతున్నారు. ఇవి 365 రోజులూ పనిచేస్తాయి. తద్వారా ఇకపై కనీస మద్దతు ధర లేని పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలకు మద్దతు ధరను ప్రతి ఏటా ముందే ప్రకటిస్తారు. ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ... కృష్ణా జిల్లాలో... 6 ఎకరాల 4 సెంట్లను... ఎకరా రూ.లక్షకు ఇవ్వనున్నారు. కడప జిల్లాలో... రాయచోటి ప్రాంతంలో... 4 ఎకరాల్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి ఇవ్వనున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి DPR తయారీకి రైస్ నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం పోర్టు ముఖ పరిధిని కుదించబోతున్నారు.

CRDA పరిధిలో అవినీతి, స్కాం పరిశీలనకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనిపించాయన్న ప్రభుత్వం... నైతిక విలువలు దిగజార్చారనీ, అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు తప్పులు చేశారని నివేదికలో ఉన్నట్లు తెలిపింది. దీనిపై దర్యాప్తునకు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. ఉపసంఘం నివేదికలో... 2014 డిసెంబర్ 31న రాజధాని ప్రకటనకు ముందు ఎవరెవరు అమరావతి పరిసరాల్లో భూములు కొన్నారో... పూర్తి వివరాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తునకు లోకాయుక్త లేదా సీబీఐకి అప్పగించాలా అన్న అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాల్ని పరిశీలించేందుకు ఏర్పాటైన GN రావు కమిటీ రిపోర్టును ప్రభుత్వం కేబినెట్ ముందు పెట్టగా... దానిపై మంత్రులు చర్చించారు. ఆ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (BCG) రిపోర్ట్ రావాల్సి ఉందన్న ప్రభుత్వం... అది కూడా వచ్చాక... రెండు రిపోర్టులపై... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ (హై పవర్ కమిటీ) చర్చించనుంది. ఈ కమిటీలో సీనియర్ అధికారులు, మంత్రులు ఉంటారు. ఓవరాల్‌గా రాజధాని నిర్మాణానికి ఎంతకాలం పడుతుందో కేబినెట్ భేటీ చర్చించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా GN రావు కమిటీ చర్చించిందని మంత్రులు తెలిపారు.

స్కూల్స్ మరమ్మతుల కోసం రూ.12వేల కోట్లు, హాస్పిటల్స్ కోసం రూ.14వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్లు, పోలవరం నిర్మాణానికి, ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి, రాయలసీమ నీటికి రూ.లక్ష కోట్లు, అమ్మఒడికి రూ.6వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.45వేల కోట్లు వాటర్ గ్రిడ్ కోసం రూ.40వేల కోట్లు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు, పేదలకు బియ్యం ఇవ్వడానికి రూ.10వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.6వేల కోట్లు, రైతులకు వ్యవసాయ పెట్టుబడి నిధి కోసం ఏడాదికి రూ.8వేల కోట్లు, మౌలిక వసతులు, రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటిపై ఇవాళ్టి మంత్రిమండలి సమావేశం చర్చించింది.
Published by: Krishna Kumar N
First published: December 27, 2019, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading