AP Politics: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సమైక్య రాష్ట్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయ్.. ఆ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పునరేకీకరణ వైసీపీ విధానమని ప్రకటించి సరికొత్త చర్చకు తెరలేపారు. కుదిరితే మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏకం కావాలని వైసీపీ కోరుకుంటోందని, ముఖ్యమంత్రి జగన్‌ది కూడా అదే అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు సజ్జల. మరి..సమీప భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు వస్తాయా..? ఏపీ..తెలంగాణ ఒకే రాష్ట్రంగా అవతరిస్తుందా? అసలు అది సాధ్యమేనా.. ఏదో సజ్జల అనుకోకుండా మాట్లాడరా..? లేక మనసులో అదే ఫీలింగ్ ఉందా.. కాదంటే ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహం ఉందా. అనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arunu Kumar) సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌పై జగన్ వైఖరిని తప్పుబట్టారు. దీంతో వైసీపీ కౌంటర్ అటాక్ గానే ఈ వ్యాఖ్యలు చేసినా.. వెనుక భారీ వ్యూహం ఉంది అంటున్నారు.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేసిన పాపం కాంగ్రెస్ , బీజీపేలదే అని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ వచ్చిన వైసీపీ ఈసారి కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే పరిస్థితి వస్తే ఆహ్వానించే వారిలో మొదటి వరుసలో ఉంటామన్నది వైసీపీ స్టాండ్. అంతే కాదు రెండు రాష్ట్రాలను కలిపి మళ్లీ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయాల్సి వస్తే ముందు ఉండి పోరాడతామని కూడా సజ్జల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇ చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి కావని.. పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ తేనె తుట్టెను సజ్జల ఉద్దేశపూర్వకంగానే రేపారట. తద్వారా రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేయటం ఒక అంశంమనే ప్రచారం ఉంది. అంతేకాదు పాలనపై కాస్త వ్యరేతకత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల అరెస్ట్ విషయాన్ని వైసీపీకి వ్యతిరేకించకపోవడం కూడా కాస్త మైనస్ అవుతోంది. గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు గెలిచినా.. బీజేపీపై పోరాటం చేయడం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను సొంత అవసరాల కోసం తాకట్టు పెట్టారనే విమర్శలు పెరిగాయి. అందులోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారి ఆ వ్యాఖ్యలు చేస్తే.. ప్రభావం భారీగానే ఉంటుంది. వాటన్నింటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే.. సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారని.. ఆంధ్రప్రజల్లో సరికొత్త సెంటిమెంట్ కు తెరలేపగలిగారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి : 40 మందికిపైగా ఎమ్మెల్యేలపై అసంతృప్తి.. కొత్త అభ్యర్థులను ఫిక్స్ చేస్తున్ జగన్..!
రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎత్తుకుంటే వైసీపీ ఒక్కటే సమైక్య వాదంతో ముందుకు వెళ్లింది. అందుకే ఉమ్మడి రాష్ట్రం అంశంపై మాట్లాడే రైట్ తమకే ఉందని వైసీపి అంటోంది. ఇక్కడే ఇంకో లాజిక్‌ను కూడా వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారట. ఇప్పుడు ఉన్నపళంగా రెండు రాష్ట్రాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతే.. ముఖ్యమంత్రి అయ్యేది తమ నాయకుడే అన్నది ఓ వర్గం నేతలు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న బలం 151 స్థానాలు. అంటే రాష్ట్రాల పునరేకీకరణ జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ, ముఖ్యమంత్రి అయ్యేది జగననేని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Sajjala ramakrishna reddy