Strange Custom in Andhra Pradesh: సాధారణంగా భారీ వర్షాలు ముంచెత్తినా.. వరదల తాకిడి ముంపు భయం ఉంది అన్నా.. లేక భారీ అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఊరు ఊరు అంతా ఖాళీ అయిపోతుంది. భయంతో గ్రామని వదిలి ప్రజలంతా పిల్లలు, పశువులతో సహా బయటకు వెళ్లిపోతారు. లేదా పుకార్లు ఉన్న సమయంలో కూడా ఇలాంటివి ఇంకా అక్కడ అక్కడా చూస్తూ ఉంటాం.. కానీ అలాంటి కారణాలు ఏమీ లేకుండా ఓ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. పిల్లపాపలు, ముసలి ముతక, పశువులు, కోళ్లు, కుక్కలు ఇలా ఏవీ లేవు. అన్నింటినీ తీసుకుని అందరూ కలసి ఊరు వదిలి వెళ్లిపోయారు. దీంతో గ్రామం మొత్తం నిర్మాణుష్యంగా మారింది. అయితే ఆ ఊరి ప్రజలంతా ఏమయ్యారు అనుకుంటున్నారా..? వారంతా దర్గా దగ్గర వంటా వార్పులు చేసుకున్నారు. అదేంటి ఊరు మొత్తం ఎందుకు వెళ్లింది.. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది.. అసలు ఆ ఊరికి ఏమైంది.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు అలా జరిగిందో తెలుసా...?
అనంతపురం జిల్లా (Anantapuram District) తాడిపత్రి మండలం (Tadipathri Mandal) తలారిచెరువు గ్రామంలో ఈ పరిస్థితి కినిపిస్తోంది. ఇలా చేయడానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 600 ఏళ్ల నుంచి ఆ ఊరికి వారికి ఒక ఆచారం ఉంది. మాఘ మాసం పౌర్ణమి రోజు ఆ ఊళ్లో ఒక్కరు కూడా అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్థులు తమ కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్తారు. పిల్లాపాపలు, ముసలివారు, పశువులతో సహా తీసుకుని ఊరికి దూరంగా వెళ్తారు. మరుసటి రోజు ఉదయం పూజలు ముగించుకుని తమ ఇళ్లకు చేరుకుంటారు. గ్రామంలో ఎలాంటి అగ్గి గాని, వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణంవైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లి ఒక రోజు గడుపుతారు. మాఘపౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గిగాని, లైట్లుగాని వెలిగించరు. ఇలా ఎందుకు చేస్తారో తెలిసా షాక్ అవుతారు.
Different Culture || ఆ గ్రామం అంతా ఖాళీ ||పిల్లలు, పశువులతో సహా మాయం ||ఆ... https://t.co/S91K9UQXMr via @YouTube #andhrapradesh #anantapuram #culture @AnantapurPolice @NBKHelpingHands
— nagesh paina (@PainaNagesh) February 19, 2022
ఇదీ చదవండి : తిరుమలలోనే హనుమంతుని జన్మస్థలం.. ఎలా నిర్ధారించారో తెలుసా..?
సుమారు 600 ఏళ్ల కిందట.. ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి ఆ గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని, ధనాన్ని దోచుకుని
వెళ్తుండగా.. గ్రామస్తులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చారు. దీంతో ఆ ఊరి మీద కోపంతో ఆ బ్రాహ్మణుడు మరణిస్తూ శాపం విధించాడని పూర్వికులు చెప్పారంట..? అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడి శాపం ప్రకారం ఆ ఊరికి కష్టాలు మొదలయ్యాయి. పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ.. కరవు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాల్సి వచ్చేది.
ఇదీ చదవండి : ప్రభుత్వం షాకిచ్చిందా..? ఆయన కోరుకున్నదే జరిగిందా..? సీఎంఓ నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఔట్
ఇలా చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డారు.. దీంతో గ్రామస్థులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పట్టణానికి వెళ్లి అక్కడి స్వాములోరిని కలిసి
తమ బాధను చెప్పుకున్నారు. ఆ పండితుడు గ్రామంలోని వారు మాఘచతుర్థదశి అర్ధరాత్రి నుండి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఊరు విడిచి
వెళ్లాలని సూచించారట. ఆ ఆచారం ప్రకారం వారు.. మాఘ పౌర్ణమి రోజున ఊర్లోని వారందరూ గ్రామాన్ని ఖాళీ చేసి, సమీపంలోని హాజివలి
దర్గాలో నిద్ర చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వంటావార్పు చేసుకుంటారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వలస
వెళ్లినవారు సైతం వచ్చి, ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Life Style