హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Theft: ఈ తోడు దొంగలకు పనంటే ఎంత శ్రద్ధో చూడండి.. టైమ్ వేస్ట్ కాకుండా ఏం చేశారంటే..!

Theft: ఈ తోడు దొంగలకు పనంటే ఎంత శ్రద్ధో చూడండి.. టైమ్ వేస్ట్ కాకుండా ఏం చేశారంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: ఈ ఇద్దరు దొంగలకు మాత్రం టైమ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదట. చిన్న టైమ్ గ్యాప్ దొరికితే చాలు ఎంచక్కా సొత్తు దోచుకెళ్లిపోతున్నారు. వారి టైమ్ వాడకం ఎలా ఉందంటే కోర్టు వాయిదాకి వచ్చిన గ్యాప్ లో కూడా చోరీ చేసేంత.

  Anna Raghu, Guntur, News18

  దొంలంటే సాధారణంగా రాత్రిపూట టైమ్ చూసుకొని ఇళ్లు, షాపులు దోచేస్తారు. సరైన ఛాన్స్ కోసం గంటలు కాదు రోజుల తరబడి ఎదురుచూస్తారు. చక్కని స్పాట్ దొరకాలేగానీ.. రోజులు, వారాలు టైమ్ వేస్ట్ చేసుకొని మరీ రెక్కీ చేస్తారు. ఎవరికీ దొరక్కుండా ఉండాలనే ప్లాన్ తో పక్కా స్కెచ్ తో సమయాన్ని పట్టించుకోకుండా తమలోని చోరకళను వెలికి తీస్తారు. కానీ ఇద్దరు దొంగలకు మాత్రం టైమ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదట. చిన్న టైమ్ గ్యాప్ దొరికితే చాలు ఎంచక్కా సొత్తు దోచుకెళ్లిపోతున్నారు. వారి టైమ్ వాడకం ఎలా ఉందంటే కోర్టు వాయిదాకి వచ్చిన గ్యాప్ లో కూడా చోరీ చేసేంత. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ఇద్దరు దొంగలు ఇలాగే టైమ్ వేస్ట్ చేయకుండా టాలెంట్ చూపి అడ్డంగా దొరికిపోయారు.

  వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా (Prakasham District) అదంకి దగ్గర జార్లపాలెంలో గత నెల 29వ తేదీన ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఘటనలో బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులతో పాటు విలువైన వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంటికి కొంచెం దూరంలోని కస్యాపురంలో ఉన్న ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు కుదరకపోవడంతో వెనుదిరిగారు. సమాచారం అందుకున్న అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి క్లూజ్ టీమ్స్, డాక్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ఘటనాస్థలిని పరిశీలించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు.

  ఇది చదవండి: ప్రార్ధన పేరిట పాడుపనులు.. అమ్మాయిలను బంధించి వికృత చేష్టలు.. ఏకంగా వందకోట్లు వసూలు..


  అక్కడ దొరికిన వేలిముద్రలు పాతనేరస్తులవిగా గుర్తించి వారి కోసం గాలించారు. దొంగలు గుంటూరు జిల్లా నల్లపాడు మండలం గోరంట్లకు చెందిన చిల్లర సురేష్, తురకపాలెంకు చెందిన బాతుల వెంకట్రావుగా గుర్తించారు. వీళ్లిద్దరూ గతంలో పలు దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. నిందితులిద్దరూ దొంగతనాల్లో ఆరితేరినవారు కావడంతో పోలీసులు వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో రామాపురంలో ఉండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగలిద్దరూ చెప్పిన విషయాలకు పోలీసులు ముక్కునవేలేసుకున్నారు.

  ఇది చదవండి: ప్రియుడి మోజులోపడి ఎంత పనిచేసింది..! భర్తను మాయం చేసిన మూడు నెలలకు షాకింగ్ ట్విస్ట్..


  అప్పటికే ఓ దొంగతనం కేసులో బెయిల్ పై ఉన్న వీళ్లిద్దరూ.. ఓ కేసుకు సంబంధించిన విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వచ్చారు. ఎలాగో బయటకి వచ్చాం కదా ఊరికే తిరిగి వెళ్లడం ఎందుకని చోరీ చేసి అందినకాడికి దోచుకెళ్లారు. పాత కేసులతో పాటు కొత్త కేసులన్నీ వారిపై బుక్ చేసిన పోలీసులు ఇద్దర్నీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. దొంగతనాల్లో టైమ్ వేస్ట్ చేయకూడదని భావించిన ఈ తోడు దొంగలు.. తప్పుడు పనులతో జీవితాన్ని నాశనం చేసుకున్నారన్న సంగతి మాత్రం మరిచిపోయినట్లున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Prakasham dist, Robbery

  ఉత్తమ కథలు