THE WHEREABOUTS OF A MISSING FATHER 19 YEARS AGO WERE REVEALED TO THE SON VIA A SHORT MESSAGE THAT CAME ON WHATSAPP BK PRV
Missing Dad: 19 ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఏళ్ల అనంతరం వాట్సాప్‌లో వచ్చిన చిన్న మెసేజ్‌తో దొరికిన ఆచూకీ.. ఈ కథ తెలుసుకోవాల్సిందే..
తండ్రీ కొడుకులు
పాత సినిమాల్లో చూసి ఉంటాం చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు మళ్లీ పెద్దయ్యక కలుసుకోవడం.. తిరనాల్లో తప్పిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కొన్ని సంవత్సరాల తరువాత కలవడం వంటి సంఘటనలు అయితే అవి నిజ జీవితంలో జరగడం మాత్రం చాలా అరుదు.. కానీ అచ్చం అలాంటి సంఘటన జరిగింది నిజజీవితంలో.
మనందరం పాత సినిమాల్లో చూసి ఉంటాం చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలు మళ్లీ పెద్దయ్యక కలుసుకోవడం.. తిరనాల్లో తప్పిపోయిన తల్లిదండ్రులు మళ్లీ కొన్ని సంవత్సరాల తరువాత కలవడం వంటి సంఘటనలు అయితే అవి నిజ జీవితంలో జరగడం మాత్రం చాలా అరుదు.. కానీ అచ్చం అలాంటి సంఘటన నెల్లూరు జిల్లా లో చోటు చేసుకుంది. 19 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రి ఆచూకి వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన ఒక్క మెసెజ్ ఆధారంగా మళ్లీ తన తండ్రిని చేరుకున్నాడు ఒక వ్యక్తి. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా అయితే ఆ సంఘటన ఎలా జరిగింతే మీరు చదవండి.
బండ్ల సురేష్ నెల్లూరు జిల్లా కోవూరు గమళ్ల పాళెంకు చెందిన వ్యక్తి. కుంటుంబంతో గమళ్ల పాళెంలోనే నివసిస్తూ ఉన్నాడు. అయితే సురేష్ కు 2004 లో పెళ్లి అయింది. పెళ్లైన కొన్ని రోజులకే తన తండ్రి అనుకోని విధంగా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి సురేష్ తన తండ్రి జాడ కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కాని ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. చాలా ఏళ్లు తన తండ్రి కోసం చాలా ప్రాంతాలు, పోలీసుల కంప్లైట్స్, కుటుంబ సభ్యుల దగ్గర ఆరా తీయడం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో ఇక తన తండ్రి తమకు దక్కడనే ఉద్దేశంతో జీవనం సాగిస్తున్నాడు. అలా దాదాపు 19 ఏళ్లు గడిపోయాయి. కాని తన తండ్రి ఆచూకి మాత్రం దొరకలేదు సురేష్ కి. అయితే అనుకోకుండా ఒక రోజు సురేష్ వాట్సాప్ గ్రూపునకు వచ్చిన ఒక చిన్న మెసేజ్ తన తండ్రి జాడ తెలుసుకోవడానికి కారణమైంది.
గ్రూపులోకి ఫొటో ఎలా వచ్చిందని..
ఆ మెసెజ్ లో వచ్చిన ఫొటోలో తన తండ్రి కనిపించడంతో ఆ మెసెజ్ ఎక్కడ నుంచి ఆ గ్రూపు కి వచ్చిందని చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి తన తండ్రి కేరళలో కొట్టాయంలో ఒక ఓల్డ్ఏజ్ హోమ్ లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే కేరళలోని కొట్టాయంకు వెళ్లి అక్కడ నవజీవన్ ట్రస్ట్ సంరక్షణలో ఉన్న తన తండ్రిని చూసి, ఒక్కసారిగాని హత్తుకున్నాడు. ట్రస్ట్ వాళ్లకు తన తండ్రి ఆనవాళ్లు చెప్పి తన తండ్రి ఐడీ కార్డులు చూపించి వారి అనుమతితో, తండ్రి అంగీకారంతో ఆయన్ని తిరిగి నెల్లూరు జిల్లా కోవూరికి తీసుకొచ్చాడు సురేష్.
ఆరు నెలల కిందటే..
దాదాపు 19ఏళ్ల తర్వాత సురేష్ తండ్రి బండ్ల సుబ్బారావు తిరిగి రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనారోగ్యంతో మనిషి కాస్త సన్నబడినా ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుబ్బారావు సురేష్ దగ్గర నుంచి తప్పిపోయి 19 ఏళ్లవుతున్నా.. నవజీవన్ ట్రస్ట్ కి ఆయన చేరుకుని కేవలం ఆరు నెలలే అవుతుందని చెబుతున్నారు నిర్వాహకులు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.