Home /News /andhra-pradesh /

THE SUPREME COURT HAS DISMISSED A PETITION FILED BY A DEVOTEE SEEKING TO INTERFERE IN THE RITUALS OF THE TIRUMALA TEMPLE PRV GH

Tirupati Temple Case: తిరుమల ఆలయ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేం.. భక్తుడి పిటిషన్​ను కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుమల ఆలయం (ఫైల్)

తిరుపతి తిరుమల దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam) ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ ఓ భక్తుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ (special leave petition) మంగళవారం సుప్రీంకోర్టు (Supreme court)లో విచారణకు వచ్చింది

తిరుపతి తిరుమల దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam) ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ ఓ భక్తుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ (special leave petition) మంగళవారం సుప్రీంకోర్టు (Supreme court)లో విచారణకు వచ్చింది. ఆలయ రోజువారీ వ్యవహారాల్లో రాజ్యాంగబద్ద న్యాయస్థానం జోక్యం చేసుకోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆలయ పాలనా విభాగం నిర్దేశించిన నియమ, నిబంధనలు పాటిస్తుందా లేదా అనే విషయాలను మాత్రమే సుప్రీంకోర్టు చూస్తుందని సుప్రీంకోర్టు (Supreme court) తెలిపింది. ఆలయ ఆచారాలు, సేవలకు సంబంధించిన సమస్యలపై కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోగలమా? కొబ్బరికాయను ఎలా పగలకొట్టాలి, హారతి ఎలా ఇవ్వాలి అనే విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Supreme court CJ NV Ramana), పిటీషనర్ శ్రీవారి దాదాను ప్రశ్నించారు. ఆలయ రోజువారీ వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనం జోక్యం చేసుకోదని తేల్చిన సుప్రీంకోర్టు, శ్రీవారి భక్తుడు దాదా వేసిన ప్రత్యేక పిటిషన్‌ను కొట్టివేసింది.

పూజలు, సేవల చేసే విధానాలను సరిదిద్దాలంటూ..

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు, సేవల చేసే విధానాలను సరిదిద్దాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High court)లో వేసిన ప్రజాప్రయోజనాల పిటిషన్ ( PIL)ను కొట్టివేయడంతో ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఆచార, వ్యవహారాల్లో దేవస్థానం ఏమైనా అసంబద్ద విధానాలకు పాల్పడిందా అనే విషయాన్ని, ట్రయల్ కోర్టులో సివిల్ దావా ద్వారా మాత్రమే నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. పిటిషనర్ వేసిన కేసులోని విషయాలు ఆలయ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం (Interference in day-to-day affairs) చేసుకునే విధంగా ఉన్నాయి. ఇది రాజ్యాంగబద్దమైనది కాదు (Not Constitutional). నిర్దేశించిన పద్దతి ప్రకారం ఆలయంలో ఆచారాలు, సేవలు (Rituals and services in the temple) నిర్వహించకపోవడం అనేది ట్రయల్ కోర్టులో విచారించవలసి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడా ధర్మాసనం (bench) జారీ చేసిన ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది.

భక్తుడి స్పెషల్​ లీవ్​ పిటీషన్​ కొట్టివేత..

పరిపాలన నియమాలు, నిబంధనలను పాటించకపోవడంపై ఏవైనా సమస్యలు ఉంటే, తిరుపతి తిరుమల దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam) స్పందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘‘అదే సమయంలో ఆచారాలు కాకుండా, పరిపాలన సరిగ్గా జరగని సమస్యలు ఏవైనా ఉంటే, నియమ నిబంధనలు విస్మరించడం (Ignoring the rules), మరేదైనా ఉల్లంఘనలకు పాల్పడం లాంటివి ఉంటే సరిచేయమని మేము పాలక మండలిని ఆదేశించగలం, సేవలు, ఉత్సవాలకు సంబంధించిన విషయాలను పిటిషనర్ తగిన ఫోరంలో కేసు కొనసాగించుకోవచ్చు. ఆచారాల విషయంలో మాత్రం మేం జోక్యం చేసుకోబోం. సేవల్లో జోక్యం చేసుకోవడం పద్దతికాదని’’ ధర్మాసనం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఏవైనా నియమాలు, నిబంధనల ఉల్లంఘనలు ఉంటే దేవాలయ పాలక మండలి స్పందించాల్సి ఉంటుందని కోర్టు ఉత్వర్లుల్లో పేర్కొంది. పిటిషనర్ ఫిర్యాదులపై 8 వారాల్లో పాలక మండలి స్పందించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటీషన్ (SLP)ని కొట్టివేసింది. ఇంకా దీనిపై ఏవైనా సమస్యలు ఉంటే పిటిషనర్ సరైన ఫోరంను సంప్రదించవచ్చని కోర్టు సూచించింది.

పిటిషనర్ ఇచ్చిన రిప్రజంటేషన్ పై దేవస్థానం స్పందించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. పెద్ద జీయర్ స్వామి, చిన జీయర్ స్వామి పర్వవేక్షణలో వైష్ణవ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వెంకటేశ్వరస్వామికి అర్చకులు సేవలు నిర్వహిస్తున్నారని దేవస్థానం కోర్టుకు తెలిపింది. రామానుజాచార్య రూపొందించిన విధంగా సేవలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ( Tirumala Tirupati Devasthanam) ఓ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. దేవాలయ ఆచారాలను, సేవలను పూజారులు అత్యంత భక్తితో, చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారని టీడీపీ కోర్టుకు తెలిపింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Andhra Pradesh, Supreme Court, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు