హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

NIT Andhra Pradesh: ఇతర వర్సిటీలతో NIT ఆంధ్రప్రదేశ్ సహకార ఒప్పందం.. రిసెర్చ్ ప్రాజెక్ట్స్‌ను ప్రమోట్ చేయడమే లక్ష్యం

NIT Andhra Pradesh: ఇతర వర్సిటీలతో NIT ఆంధ్రప్రదేశ్ సహకార ఒప్పందం.. రిసెర్చ్ ప్రాజెక్ట్స్‌ను ప్రమోట్ చేయడమే లక్ష్యం

ఎన్​ఐటీ ఏపీ (Photo : Twitter)

ఎన్​ఐటీ ఏపీ (Photo : Twitter)

రిసెర్చ్ బేస్డ్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఇతర యూనివర్సిటీలతో పరస్పర సహకార ఒప్పందాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ (NIT Andhra Pradesh). కుదుర్చుకుంది.

రిసెర్చ్ బేస్డ్ ప్రాజెక్టులను (Research Based Projects) ప్రోత్సహించడానికి ఇతర యూనివర్సిటీలతో పరస్పర సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్ (NIT Andhra Pradesh). నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి (NEP 2020) అనుగుణంగా పరిశోధనకు సంబంధించిన మౌలిక సదుపాయాలను (Infrastructure) ఇతర విద్యాసంస్థలతో పంచుకోవడానికి.. UG, PG స్థాయిలలో ఉమ్మడి విద్యా కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU)- కాకినాడ, డాక్టర్ వై.ఎస్.ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ- తాడేపల్లిగూడెం, ఆదికవి నన్నయ యూనివర్సిటీ- రాజమండ్రి.. వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు (For higher education institutions) ఈ సహకార ఒప్పందం ప్రయోజనం చేకూరుస్తుందన్నారు NIT ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్, ప్రొఫెసర్ సీఎస్‌పీ రావు. ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ‘మాకు ప్రతిభావంతులైన అధ్యాపకులు, అత్యంత ప్రేరణ పొందిన విద్యార్థులు, భాగస్వాములు ఉన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సేవ ఆధారిత పరిశోధన ప్రాజెక్టుల (Service-oriented research projects) కోసం కొత్త జ్ఞానం, అభ్యాస వేదికను సృష్టించడానికి మేము సహకారం కోరుతున్నాం’ అని చెప్పారు.

* NIT ఆంధ్రప్రదేశ్ పరిశోధన సహకారం ఒప్పందం వివరాలు..

ఒప్పందంలో భాగంగా రెండు పార్టీలు తమ అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది, పరిశోధన విస్తరణ కేంద్రాల మధ్య మార్గదర్శకత్వం, సహకారాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలి.

సంస్థలు పరస్పరం అంగీకరించే నిబంధనల ఆధారంగా ఉమ్మడి పరిశోధన (Joint research), విద్యా కార్యకలాపాలను తప్పనిసరిగా నిర్వహించాలి.

అకడమిక్స్, రిసెర్చ్ విషయంలో ఉత్తమ ఫలితాల (best Result) కోసం విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి.. శిక్షణ, అభివృద్ధి కార్యకలాపాలను సులభతరం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం.

రెండు సంస్థలు పరిశోధన, సంబంధిత మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా పంచుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా UG, PG స్థాయిలలో ఉమ్మడి విద్యా కార్యక్రమాలను (Joint educational programs) రూపొందించి అమలు చేయాలి.

సెమినార్‌లు, శిక్షణ వర్క్‌షాప్‌లు (Training workshops), కాన్ఫరెన్స్‌లు, ఇతర కార్యకలాపాలను సంస్థలు సంయుక్తంగా నిర్వహించాలి.

ఈ సహకార ఒప్పందంలో భాగంగా నిర్వహించిన ఎంవోయూ (MoU) కార్యక్రమంలో ఇతర ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ శంకర్ రెడ్డి; ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ & కన్సల్టెన్సీ విభాగం డీన్ ప్రొఫెసర్ జి. రవికిరణ్ శాస్త్రి, JNTU కాకినాడ రిజిస్ట్రార్ సుమలత, JNTUK ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ ప్లేస్‌మెంట్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ Dr. N. మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్‌ను 2015-16లో జాతీయ ప్రాధాన్య విద్యాసంస్థగా స్థాపించారు. ఈ సంస్థలో 140 మంది అధ్యాపకులు, 2,657 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2,299 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 288 మంది పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, EDUCATION

ఉత్తమ కథలు