వందేండ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితులు లేవన్న టీటీడీ.. ఏంటో తెలుసా..

కోవిడ్ 19 కారణంగా రూ. 3 వేల కోట్లకుపైనే ఉంటే టీటీడీ వార్షిక బడ్జెట్... రూ. 2 వేల కోట్లకు దిగిరానుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఆ లోటును ఏలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసేశారు. ఇల వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం మూసేశారు. దీంతో తిరుమల ప్రాంగణమంతా బోసిబోసిపోయింది. దాదాపు 45 రోజులుగా భక్తుల దర్శనాలు రద్దయ్యాయి. దీంతో ప్రతినెలా సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, అద్దె గదులు వంటి వాటి ద్వారా వచ్చే సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల ఆదాయం కోల్పోయినట్టయ్యింది. అయితే వందేండ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఆ లోటును ఏలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో టీటీడీ వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలకమండలి సభ్యులు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే చైర్మన్‌గా తాను, పాలకమండలి సభ్యులు వేతనాలు తీసుకోలేదని గుర్తు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: