గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్ స్పందన.. ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపామని స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా బాధితులను ఆదుకునేందుకు కార్యక్రమాలను చేపడతామని ప్రకటించింది.

  • Share this:
    విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. బాధితులకు క్షమాపణలు చెబుతూ.. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, విషవాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. బాధితులు, మృతులకు అండగా నిలబడడమే కాకుండా అన్నిరకాల చర్యలను తక్షణమే అమలు చేస్తామని పేర్కొంది. గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపామని స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా బాధితులను ఆదుకునేందుకు కార్యక్రమాలను చేపడతామని ప్రకటించింది. ఇదిలావుంటే.. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన వల్ల కంపెనీ చుట్టూ మూడు కిలోమీటర్లకు విషవాయువు విస్తరించి స్థానికులు చనిపోయారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం స‌ృష్టించిన సంగతి తెలిసిందే.
    Published by:Narsimha Badhini
    First published: