Home /News /andhra-pradesh /

THE HIGH COURT ISSUED KEY DIRECTIONS TO COURT EMPLOYEES IN ANDHRA PRADESH BN

ఏపీలో కరోనా కేసులు.. ఉద్యోగులకు హైకోర్టు కీలక ఆదేశాలు..

ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం విడిచి వెళ్లొద్దని, అలా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలను ఇచ్చింది. హైకోర్టు అధికారులు, సిబ్బంది కేంద్ర కార్యాలయం విడిచి వెళ్లొద్దని, అలా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ ప్రకటించారు. అయితే ఇప్పటికే అధికారుల అనుమతితో వేరే రాష్ట్రానికి వెళ్లిన వారు విధుల్లోకి తిరిగి వచ్చేముందు క్వారంటైన్‌లోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీనికితోడు కోర్టు విధులను ముగించుకున్న ఉద్యోగులు ఎటూ వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లాలని సూచించింది. ఇదిలావుంటే.. హైకోర్టు ప్రవేశమార్గం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుని మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. అధికారిక పని ఉంటే తప్ప ఇతర సమయాల్లో హైకోర్టు వరండా, ప్రాంగణంలో గుంపులుగా ఉండడాన్ని ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే.

    హైకోర్టు ప్రాంగణంలో ఉమ్మి వేయడాన్ని సైతం నిషేధించారు. భోజన సమయంలో తప్ప.. కార్యాలయ పని, పని వేళల్లో సిబ్బంది ఎవరైనా సీటులో ఉండడం లేదని గుర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వివరించారు. కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో నివసించే అధికారులు, సిబ్బంది రాతపూర్వకంగా ఉద్యోగులు రాతపూర్వకంగా నియంత్రణ అధికారికి ఆ వివరాలు సమర్పించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
    First published:

    Tags: AP High Court, Corona virus, Covid-19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు