హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ ప్రభుత్వానికి షాక్.. జీఓ నంబర్ 623ని రద్దు చేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి షాక్.. జీఓ నంబర్ 623ని రద్దు చేసిన హైకోర్టు

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీ హైకోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున కోర్టుకు న్యాయవాది వాదనలు విన్పించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 623ను హైకోర్టు రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున కోర్టుకు న్యాయవాది వాదనలు విన్పించారు. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించలేదని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు తీసుకుంటున్నామని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 28న సుమోటో కేసుగా హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Highcourt

ఉత్తమ కథలు