మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు..

8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లు, మరో చోట ఫిష్ ల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనుంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పారు. మత్స్యకారులెవ్వరూ ఇతర రాష్ట్రాలకు వలసపోకూడదనే ఉద్దేశంలో రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఫిషింగ్ హార్బర్లు, మరో చోట ఫిష్ ల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు గురువారం సీఎం జగన్ రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష నిర్వహించారు. రెండున్నర నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో వీటిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని సీఎం జగన్ చెప్పారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీస్‌ మాత్రమే ఇచ్చారన్నారు. గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని చెప్పారు.

  ఇప్పుడు దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతున్నామని ప్రకటించారు. సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పులను తీసుకు వస్తాయని, చేపల వేట పెరగడంతో పాటు వారికి ఆదాయం పెరిగేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

  ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసే ప్రాంతాలివే..
  శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
  శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం
  విశాఖపట్నం జిల్లా పూడిమడకలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
  తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
  ప.గో.జిల్లా నర్సాపురంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్
  కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,
  గుంటూరుజిల్లా నిజాంపట్నంలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్,
  ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌
  నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌
  Published by:Narsimha Badhini
  First published: