• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • THE FOURTH INSTALLMENT OF RATION WILL BE DELIVERED FROM TOMORROW IN ANDHRA PRADESH BN

గుడ్ న్యూస్.. రేపట్నుంచి నాలుగో విడత రేషన్..

గుడ్ న్యూస్.. రేపట్నుంచి నాలుగో విడత రేషన్..

ఇప్పుడు బియ్యం కార్డులే ఆదాయ సర్టిఫికెట్లు కావడంతో ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది.

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు చౌక డిపోల ద్వారా సరుకులు అందించనున్నారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా చాలామంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. అయితే వీరిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం శనివారం నుంచి నాలుగో విడత ఉచిత రేషన్ సరుకులను అందించనుంది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ద్వారా ఒక్కో కార్డుకు కిలో శనగలు, ప్రతి సభ్యుడికి ఐదు కిలోలు బియ్యం అందజేస్తారు. అర కేజీ పంచదారను మాత్రం సబ్సి డీ ధరపై సరఫరా చేస్తారు. ఇప్పటికే సరుకుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు చౌక డిపోల ద్వారా సరుకులు అందించనున్నారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతి కార్డుదారుడికి గ్రామ/వార్డు వలంటీర్లు వీటిని అందజేస్తారు. కూపన్‌లో సూచించిన తేదీలో నిర్ధేశించిన సమయానికి వెళితే బయోమెట్రిక్‌ ద్వారా డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. మాస్కులు వేసుకుని భౌతిక దూరం పాటించి రేషన్‌ సరుకులు తీసుకోవాలని వలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు