• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • THE ED CID SPECIAL COURT ADJOURNED THE HEARING ON THE JAGAN INAPPROPRIATE ASSETS CASE PRN

YS Jagan Case: సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా..! కేసు వివరాలివే..!

YS Jagan Case: సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా..! కేసు వివరాలివే..!

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఈసారి విచారణకు జగన్ తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఐతే అమ్మఒడి రెండో విడత ప్రారంభోత్సవం ఉండటంతో జగన్ తరపున లాయర్లు హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రా, హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, హెటిరో డ్రగ్స్‌, హెటిరో ల్యాబ్స్‌, హెటిరో హెల్త్‌కేర్‌, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, అరబిందో ఫార్మా లిమిటెడ్‌, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ శరత్‌చంద్రారెడ్డి తదితరులు విచారణకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

  అక్రమాస్తుల వ్యవహారంలో అరబిందో, హెటిరో సంస్థలకు జరిగిన భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న అభియోగాలతో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 2016లో నమోదు చేసిన కేసులో సీఎం జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే నాంపల్లి కోర్టులోని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ అభ్యర్థించారు. దీనితో ఈడీ అరబిందో, హెటిరోలకు భూకేటాయింపు చార్జిషీట్లు సీబీఐ కి బదిలీ చేసింది. సీఎం జగన్ కేసుల విషయంలో సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్ల ఆధారంగానే ఈడీ ఇప్పటికే విచారణ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరు అంశాలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జి షీట్లను దాఖలు చేసింది.

  అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ పై నమోదైన ఆరు కేసుల్లో ఐదింటిని సీబీఐ న్యాయస్థానంలో, ఒకదాన్ని మాత్రం నాంపల్లి సెషన్స్ కోర్టులో ఈడీ సమర్పించింది. అయితే ఆ ఛార్జిషీట్ ను కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులపైనా ఒకే చోట విచారణ చేపట్టడం బెటర్ అనే ఉద్దేశంతో హైకోర్టు పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది. కొత్త కేసు కాబట్టి తాజాగా విచారణ చేపట్టాలని ఈడీ న్యాయ స్థానం నిర్ణయించింది. అందుకే జగన్ తో పాటు ఆ కేసులో ఉన్న మొత్తం 19 మందికి ఇటీవల సమన్లు జారీ అయ్యాయి. దీనిపైనే తాజాగా కోర్టు విచారణ జరపింది.

  ఇవీ అభియోగాలు...!
  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జడ్చర్ల సెజ్‌లో అరబిందో, హెటిరో సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల్లో క్విడ్‌ ప్రోకో జరిగిందని సీబీఐ, ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అరబిందో, హెటిరో సంస్థలకు నిబంధనలు తుంగలో తొక్కి చెరో 75 ఎకరాలను ఎకరం కేవలం రూ.7లక్షల చొప్పున కట్టబెట్టింది. అలాగే మెదక్‌ జిల్లాలో అరబిందో ఫార్మా సంస్థకు ఏపీఐఐసీ కేటాయించిన 30 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు బదలాయించినట్టు మరో అభియోగం కూడా ఉంది. అప్పటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అరబిందో సంస్థ ఎండీ నిత్యానందరెడ్డి బావమరిది పి.శరత్‌ చంద్రారెడ్డి ఎండీగా ఉన్న ట్రైడెంట్‌ కంపెనీ రూ.4.33 కోట్లు లబ్ధి పొందినట్టు సీబీఐ పేర్కొంది. వీటికి ప్రతిఫలంగా అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి రూ.10కోట్లు, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి రూ.17.25 కోట్లు జగన్‌ కు చెందిన జగతి పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారని సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్ లో ఆరోపించాయి. మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరిపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. హెటిరో, అరబిందో, జననీ ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన దాదాపు రూ.51 కో ట్ల విలువైన ఆస్తులను జప్తు చేయగా., దీనిపై ప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది.
  Published by:Purna Chandra
  First published:

  అగ్ర కథనాలు