ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించి సంగతి తెలిసిందే. అయితే ఆ లాక్‌డౌన్ సమయంలో పలువురు వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం, అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే.. కొంతమంది వాహనదారులు మాత్రం చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ రోడ్లపైకి ఇష్టారాజ్యంగా వచ్చి లాక్‌డౌన్ అమలుకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసింది. అయితే వేల సంఖ్యలో వాహనాలు పట్టుబడడం అందరినీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందొచ్చని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వాహన యజమానులు సంబంధిత పోలీసు స్టేషన్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, Lockdown