ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో 15వేల మంది ఉంటే.. కేవలం 554 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నామని, వైద్య నిపుణులు సూచించే వరకు బాధితులెవరూ ఇళ్లకు వెళ్లొద్దని సూచించారు.
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు ఏలాంటి ప్రాణాపాయం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అన్నారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో 305 మంది చికిత్స పొందుతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 121 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వెంటిలేటర్స్‌పై ఎవరూ లేరని, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో 15వేల మంది ఉంటే.. కేవలం 554 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నామని, వైద్య నిపుణులు సూచించే వరకు బాధితులెవరూ ఇళ్లకు వెళ్లొద్దని సూచించారు. గ్యాస్ లీకేజీ బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మంత్రుల బృందం విశాఖపట్నంలోనే ఉండాలని సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలిచ్చారని తెలిపారు. రిలీఫ్ కేంద్రాలను పరిశీలించనున్నామని, వారికి మంచి ఆహారం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్యాస్ లీకేజీ గ్రామాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని, బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎక్స్‌గ్రేషియాను వెంనటే అందిచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.