టీడీపీవి దొంగదీక్షలు.. ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు.. మల్లాది విష్ణు..

పీపీఏలలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, టీడీపీ నేతలు గ్లోబల్స్‌లా తయారయ్యారని, టీడీపీ అసత్య ఆరోపణలకు బోండా ఉమా మాటలే నిదర్శనమని వివరించారు.

news18-telugu
Updated: May 22, 2020, 12:38 PM IST
టీడీపీవి దొంగదీక్షలు.. ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు.. మల్లాది విష్ణు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టీడీపీ చేస్తున్న దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ ప్రయోజనాలు తప్ప టీడీపీకి ప్రజాప్రయోజనాలు పట్టవని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఐదేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని, పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోందని వివరించారు. రైతులకు తొమ్మిది గంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అని, మీ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డే మీ దీక్షలు దొంగదీక్షలని చెప్పారని తెలిపారు. టీడీపీ నేతలు ఎల్లో మీడియా సహకారంతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.

పీపీఏలలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, టీడీపీ నేతలు గ్లోబల్స్‌లా తయారయ్యారని, టీడీపీ అసత్య ఆరోపణలకు బోండా ఉమా మాటలే నిదర్శనమని వివరించారు. టీడీపీకి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తెలిపారు. వైసీపీ సిటీ ఇంచార్జి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, కరొనాకి భయపడి హైదరాబాద్ పారిపోయిన చంద్రబాబు ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ప్రజలకి తెలుసని, టీడీపీ దొంగదీక్షలవల్ల ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: May 22, 2020, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading