శ్రీహరికోటలో హైఅలర్ట్... నిఘా వర్గాల హెచ్చరికలు

Terror Alert : జమ్మూకాశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని తొలగించిన తర్వాత నుంచీ ఉగ్రవాదుల కన్ను దక్షిణాది రాష్ట్రాలపై పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇస్రో, శ్రీహరికోటపై ఉగ్రవాదులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని సమాచారం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 11:24 AM IST
శ్రీహరికోటలో హైఅలర్ట్... నిఘా వర్గాల హెచ్చరికలు
శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (File)
  • Share this:
24 గంటలూ అలర్ట్‌గా ఉండండి... సముద్రం వైపు దృష్టి సారించండి... ఇదీ... కోస్ట్ గార్డ్‌లకు నిఘా వర్గాలు తాజాగా పంపిన హెచ్చరికలు. ఎందుకంటే... సముద్ర మార్గంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఐతే... తాజాగా తెలిసిందేంటంటే... నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం - శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు రెడీ అయ్యారని తెలిసింది. దాంతో అక్కడ హై అలర్ట్ ప్రకటింటారు. ప్రస్తుతం షార్ పూర్తిగా భద్రతాబలగాల రక్షణలో ఉంది. అలాగే బంగాళాఖాతంలో 50 నాటికల్ మైళ్ళ వరకూ CISF, మెరైన్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీరంలో పడవలపై నిఘా పెట్టారు. వారం నుంచీ తీర ప్రాంతాల్లో గస్తీ బాగా పెంచారు.

ఇటీవలే చంద్రయాన్ ప్రయోగం చేసిన షార్‌కి... ఇస్రో నుంచీ తరచూ శాస్త్రవేత్తలు వచ్చి వెళ్తున్నారు. ఐతే... శ్రీహరికోటను నాశనం చేస్తే... ఇస్రోకి గట్టి దెబ్బ తగులుతుందనీ, అది ఇండియాకి తీరని లోటు అవుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో శ్రీహరికోట మొదటి, రెండో గేటు దగ్గర ప్రతి వాహనాన్ని బాగా చెక్ చేసి పంపిస్తున్నారు. శ్రీహరి కోట పూర్తిగా అడవుల్లో ఉంటుంది. ఉగ్రవాదులు చొరబడేందుకు వీలుగా ఉంటుంది. ఆ ఛాన్స్ వాళ్లకు ఇవ్వకుండా... అడవుల్ని కంటిన్యూగా జల్లెడ పడుతున్నారు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading