నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...

Terror Alert : ఓవైపు ఇస్రో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన వేళ... ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 10:19 AM IST
నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం... ఇస్రోను టార్గెట్ చేస్తున్నారా...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 10:19 AM IST
నెల్లూరులో ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తెలిసింది. నెల్లూరు తీరంలో... శ్రీలంక రిజిస్ట్రేషన్‌తో ఓ పడవను గుర్తించారు. ఐతే... నెల్లూరులోని శ్రీహరికోటలో... ఇస్రో ఇవాళ ఉదయం 5-30కి పీఎస్ఎల్వీ సీ46 రాకెట్ ప్రయోగం చేపట్టింది. సరిగ్గా అదే సమయంలో... ఉగ్రవాద కలకలం రేగింది. కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోట కేంద్రానికి దగ్గర్లోనే ఆ పడవ కనిపించింది. దాంతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న అనుమానాలు కలిగాయి. దేశంలో అత్యంత కీలక స్థావరాలైన శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం, కృష్ణపట్నం పోర్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోకి చెక్ పెట్టేందుకు కుట్రలు పన్ని వుంటారన్న కోణంలో నిఘావర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తూర్పు తీరంలోని రక్షణ స్థావరాలపై ఉగ్రవాదులు గురి పెట్టి ఉంటారనే అనుమానం కూడా ఉంది. తీరంలో కనిపించిన బోటులో యమహా ఇంజిన్‌, 5 లీటర్ల ఖాళీ వాటర్ బాటిల్, రెండు 20 లీటర్ల క్యాన్లు, ఒక బెడ్‌షీట్ ఉన్నాయి.  ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.. సీఆర్‌పీసీ 102 సెక్షన్‌ కింద విడవలూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 5 లీటర్ వాటర్ బాటిల్ ఖాళీగా ఉందంటే... కనీసం ఐదారుగురు వచ్చి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి :



ఏపీలో మళ్లీ ఎన్నికలు తప్పవా... టీడీపీ ప్లాన్ అదేనా... వైసీపీ ఏం చేస్తుంది ?

ఢిల్లీ మాల్ స్పాలో సెక్స్ రాకెట్... ఒక్కో పనికి ఒక్కో రేటు

పబ్‌జీ ఆడొద్దన్నందుకు భర్తపై కోపం... విడాకులు కోరిన భార్య

నేడు అమరావతికి జగన్... బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చ
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...