ఏపీలో ఉగ్రవాదులు... హోటళ్లే టార్గెట్... అలర్టైన ప్రభుత్వం...

AP Terror Alert : సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చాలాసార్లు ఉగ్రదాడులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండూ పరస్పరం సహకరించుకుంటూ ఉగ్రవాద దాడులపై అప్రమత్తం అవుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 12:24 PM IST
ఏపీలో ఉగ్రవాదులు... హోటళ్లే టార్గెట్... అలర్టైన ప్రభుత్వం...
ఏపీలో ఉగ్రవాద హెచ్చరికలు జారీ
Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 12:24 PM IST
శ్రీలంకలో ఉగ్రవాదులు ఎంతటి మారణహోమం సృష్టించారో తెలుసుకున్నాం. చర్చిలు, హోటళ్లే టార్గెట్‌గా 13 చోట్ల ఆత్మాహుతి, బాంబు పేలుళ్లకు పాల్పడి వందల మంది ప్రాణాలు తీశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాదులు దాడులు చెయ్యాలనుకుంటున్నట్లు నిఘా వర్గాల నుంచీ హెచ్చరికలు అందాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్ని తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయన్న ఆయన... అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ప్రశ్నించాలని కొత్త ఆదేశాలు జారీచేశారు.

ఆంధ్రప్రదేశ్‌కి తీర ప్రాంతం ఎక్కువ. ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ఏపీలోకి వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో... తీర ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు. అలాగే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏపీలోని హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘాను ఒక్కసారిగా పెంచారు.

ప్రస్తుతం అధికారులంతా 24 గంటలూ అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమయ్యారు. పై అధికారుల నుంచీ వాళ్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. అసలే ఎన్నికల కౌంటింగ్‌కి సంబంధించి స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లూ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాద దాడుల కలకలం రేగడంతో... భద్రతను మరింత పెంచుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానితులు కనిపిస్తే, డయల్ 100కి కాల్ చెయ్యాలని సూచించారు.

 ఇవి కూడా చదవండి :

వరికుప్పపై ప్రాణాలు విడిచిన రైతు... తెలంగాణలో విషాదం...

చౌకీదార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ
Loading...
బీజేపీ గెలిచినా... కేంద్రంలో అధికారంలోకి రాదా...? ఆ 21 పార్టీల ప్లాన్ ఏంటి...?

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...
First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...