Home /News /andhra-pradesh /

TENSION SITUVATION IN GANNAVARAM POLICE WERE ARRESTED NARA LOKESH THAN TDP LEADERS PROTEST THERE NGS GNT

Breaking News: మరోసారి పోలీసుల అదుపులో నారా లోకేష్.. గన్నవరంలో తీవ్ర ఉధ్రిక్తత

నారా లోకేష్ అరెస్ట్

నారా లోకేష్ అరెస్ట్

TDP Leader Nara Lekesh Arrest: గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం, పోలీసులకు తీరుకు నిరసగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

    అన్నా రఘు, న్యూస్18 అమరావతి..

    Nara Lokesh Arrest: తెలుగుదేశం (Telugudesam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Loekesh)ను గన్నవరం ఎయిర్ పోర్టు (Gannavaram Airport)లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత మధ్య ఆయన్ను విజయవాడ (Vijayawada) పోలీస్ స్టేషన్ కు తరలించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను నెట్టి.. లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే  బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతులు ఏంటి..? అని లోకేష్ వాగ్వాదానికి దిగినా పోలీసులు మాత్రం వినలేదు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి లోకేశ్‌ నరసరావుపేట (Narasaropeta) పర్యటనపై సర్వత్రా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లా (Guntur District)లో పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు.. లోకేష్ వస్తున్నారని తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో సీఎం జగన్ (CM Jagan), ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. అయితే.. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. పోలీస్ వ్యాన్ నుంచే మీడియాతో మాట్లాడారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వస్తా. పరామర్శకు వెళ్తుంటే పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఏది తప్పో.. ఏది ఒప్పో తనకు తెలుసని.. తనపై ఎలాంటి కేసులు లేవన్నారు.

    ఇదీ చదవండివినాయక చవితికి కోవిడ్ ఆంక్షలు.. వైసీపీ నేతల రికార్డింగ్ డ్యాన్సుల సంగతేంటి? వీడియో చూడండి

    మరోవైపు గుంటూరు నరసరావుపేట టీడీపీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో లోకేష్‌ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. నరసరావుపేటలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను ముందస్తు అరెస్ట్ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత అరవిందబాబును కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Tdp, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు