AP Political Fight: ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) యనమలకుదురు (Yanamala Kudhuru) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదేం ఖర్మ అంటూ వైసీపీ పాలనను ప్రశ్నిస్తూ బ్రిడ్జ్ పై తెలుగు దేశం (Telugu Desam) నేతలు ఆందోళనకు దిగారు. వారు ఆందోళనలు చేస్తున్నారని తెలియడం.. వైసీపీ (YCP) కార్యకర్తలు అక్కడకు భారీగా చేరుకుని... ఇదేం ఖర్మరా బాబు అంటూ పోటీ పోటీ ఆందోళనలకు దిగారు. గొడవలు వద్దని పోలీసులు వారించినా.. ఎవరూ వెన్కు తగ్గలేదు. తాము అనుమతి తీసుకుని ఆందోళనలు చేస్తూంటే.. స్థానిక వైసీపీ నేతలు తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. తమపై దాడి చేయడానికి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలకే పోలీసులు మద్దతు ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. తాము అనుమతి తీసుకున్న తరువాత ఇలా అడ్డంకులు కలిగించడం ఏంటని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వానికి దిగారు..
అయితే పోలీసులు నచ్చ చెప్పినా ఎవరూ వెనక్కు తగ్గలేదు.. పోటా పోటీగా నినాదాలతో పరిస్థితి హోరెత్తించారు. యనమలకుదురు లో నదిపై వంతెన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ పనులను వెంటనే ప్రారంభించాలని.. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏ పనులు చేయడం లేదు.. ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.
అయితే వైసీపీ వెర్షన్ వేరేలా ఉంది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా టీడీపీ డ్రామా ఆడటం మొదలుపెట్టిందని ఆరోపిస్తోంది. టీడీపీనే బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుని.. మళ్లీ నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతుండడంతోనే.. తాము పోటీ నిరసనకు దిగామంటున్నారు వైసీపీ నేతలు.
ఇదీ చదవండి : జనసేనాని కన్ఫ్యూజ్ లో ఉన్నారా..? పవన్ నిర్ణయం పార్టీకి నష్టమా? లాభమా?
పెనమలూరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలతో ప్రదర్శనకు దిగారు. అయితే టీడీపీ నేతలను అడ్డుకునేందుకు బ్రిడ్జ్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటే.. మరోవైపు వైసీపీ నేతలు కూడా పోటీగా ఆందోళనలు చేస్తున్నా వారిని పోలీసులు ఏమీ అనడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. బలవంతంగా తమను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తే.. బ్రిడ్జిపై నుంచి దూకేస్తామని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. దీంతో యనమలకుదురు బ్రిడ్జి ఉద్రిక్త వాతావవరణం నెలకొంది.
ఇదీ చదవండి : ఎన్నారై అయినా ఒకే.. లేక చంద్రబాబు లోకేష్ అయినా రెడీ..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
మరోవైపు కడపలోని అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమించారంటూ అఖిలపక్షం నేతలు ఆరోపించారు. భావన టౌన్షిప్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఆల్‌పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అటువైపు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై అఖిలపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Krishna District, TDP, Ycp