TENSION SITUATION IN VISAKHA SEA AREA FISHERMEN FIGHTING FOR NETS THATS RAISING MANY CONTROVERSIES NGS VSP
Fisherman Fight: మళ్లీ రింగు వలల వివాదం. రెండు వర్గాల మధ్య కొట్లాటతో ఉద్రిక్తత.. అసలేంటి ఈ గొడవ..?
మత్స్యాకార వర్గాల మధ్య వివాదం
Fisherman Fight: మత్స్యాకారులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. రింగు వలల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. రింగువలలో వేటకు వెళ్లిన మత్స్యాకారులను.. సంప్రదాయ మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంత్రులు కూడా కలుగ జేసుకున్నా వివాదం సద్దుమణగడం లేదు. అసలు ఈ రింగు వల వివాదం ఏంటి..?
Fisherman Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మత్స్యకారుల (Fisherman) మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. రింగు వలల వివిదాం మరోసారి దుమారం రేపింది. ఈ సారి కొట్లాటకు దారి తీసింది. బోట్లను తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది. విశాఖ (Visakha) నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది. ఎండాడ, రేసవానిపాలెం, పెద్ద జాలరిపేట మత్స్యకారుల మధ్య రింగు విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ వర్గం మత్స్యకారులు సముద్రంలో బోటును తగలబెట్టారు. ప్రకాశం జిల్లా మత్స్యకార గ్రామాల్లో సద్దుమణిగిన రింగు వలల వివాదం విశాఖ జిల్లాకు చేరింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అంటే.. ముందు 13 బోట్లలో వాసవానిపాలెం మత్స్యకారులు రింగు వలలతో సముద్రంలోకి వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్దజాలరిపేట జాలర్లు 100 బోట్లతో అక్కడికి చేరుకున్నారు. వాసవానిపాలెం జాలర్లను చుట్టుముట్టారు. దీంతో వాసవానిపాలెం జాలర్లు వెనుదిరిగారు. వద్దు అని చెప్పిన సముద్రంలోకి ఎందుకు వస్తున్నారని ఆ బోట్లను తగలబెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది.
రింగు వలలకు సంబంధించి గత కొంత కాలంగా జాలర్ల మధ్య వివాదం జరుగుతోంది. రింగు వలలను నిషేధించాలని వీటి వల్ల చేపల ఉత్పత్తి తగ్గుతుందని.. తమకు వచ్చే చేపల వాటా కూడా తగ్గుతుందని పలువురు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగు వలల వలన చేపలు కూడా చనిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన ప్రధాన కారణం.. రింగు వలలే.. ఈ ఖరీదైన రింగు వలను వాడడం ద్వారా మొత్తం సముద్రంలోని చేపలు అన్నీ వలకు చిక్కిపోతాయి. అతి పెద్దవిగా ఉండే ఈ రింగు రింగుల వలకు చేపని చిక్క ఉండదు..సంప్రదాయ మత్స్యకారుల వలలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. చేపలు పట్టే విధానమూ అలాగే ఉంటుంది. చిన్న చేప నుంచీ పెద్ద పెద్ద చేప వరకూ అన్నీ ఈ రింగ్ వలలో అమాంతం పడతాయి. అయితే సంప్రదాయ పద్ధతిలో తెప్పలపై వేట చేసే వాళ్ల వలల వల్ల చిన్న చిన్న చేపలకు అంతగా ఇబ్బంది ఉండబోదు. రాబోయే తరాలకు మత్స్య సంపద తగ్గదు. కానీ.. రింగ్ వలల వల్ల ఎక్కువ చేపలు లభించడం ఖాయం.
రింగ్ వలలు, బల్ల వలల వల్ల చిన్న చిన్న చేపలు.. గుడ్లు పెట్టె చేపలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ వలల వల్ల నష్టాలు, లాభాలపై మత్స్యకారులకు అవగాహన ఉండాలి. కానీ.. రింగ్ వలల విషయంలో రాద్ధాంతానికి కోనెం చేపే అసలు కారణంగా మారుతోంది. సాధారణ రకాల చేపలు టన్నుల కొద్దీ పడినా.. కోనెం.. వంజరం చేపలు కొద్ది కేజీలు పడినా ఒకటే ఆదాయం. అంటే కోనెం చేప అంత కాస్ట్లీ. ప్రస్తుతం మార్కెట్ లో కోనెం ధర కేజీకి అయిదువందలపైనే ఉంది. ఇక కోనెం చేప పిల్లలు (వీటినే వంజరాలు అంటారు) కూడా కేజీకి మూడువందల తక్కువ కాదు. పెద్ద కోనెం చేప 20 కేజీల వరకూ పెరుగుతుంది. చిన్న చేపలు అరకేజీపైనే ఉంటాయి. అది కూడా ఈ వివాదనికి ఒక కారణం.. రింగు వలలు వేసేవారికి కోనెం చేప చిక్కి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ రింగు వలల వ్యవహారంపై కోర్టుకు కూడా కొందరు మత్స్యాకారులు వెళ్లారు. దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది. అయితే చాలాకాలంగా ఈ వివాదం నడుస్తుండడంతో.. మంత్రులు, రాజకీయ నేతలు కలుగు చేసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఎవరు ఎక్కడ చేపలు పట్టుకోవాలి అన్న విషయంలో సరిహద్దు రేఖలు పెట్టుకున్నారు.. ముఖ్యంగా 8 కిలోమీటర్ల దాటిన తరువాత రింగు వలల వలు చేపలు పట్టాల్సి ఉంటుంది. ఇక సంప్రదాయ మత్య్సకారులు 8 కి.లో మీటర్ల దాటి వేటకు వెళితే మాత్రం ఫైన్ విధిస్తామని గతంలో నిబంధనలు పెట్టారు. మత్స్యకార సంఘాలు, మెరైన్ ఫిషరీస్ కమిటీ, ఇతర అధికారులతో కలిపి ఒక కమిటీని వేసింది. కానీ ఎవరూ నిబంధనలు పాటించడం లేదని ఒక వర్గంపై మరో వర్గం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు.. కారణం ఏంటంటే..?
తాజా వివాదంపై మంత్రులు అవంతి, సీదిరి అప్పలరాజు స్పందించారు.. త్వరలోనే దీనికి పరిష్కారం చూపిస్తామన్నారు. విషయాన్ని సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తామని.. మరోసారి వివాదం తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఇరు వర్గాలకు మంత్రులు హామీ ఇచ్చారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.