Andhra Pradesh: సీమలో మళ్లీ పడగ విప్పుతున్న ఫ్యాక్షన్.. మొన్న కడప, నిన్న కర్నూలు.. నేడు అనంతపురం

సీమలో పడగ విప్పుతున్న ఫ్యాక్షన్

సీమ మళ్లీ భగభగ మండుతోంది. పాతకక్షలు పురి విప్పుతున్నాయి.. చాలా ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించిన సీమలో మళ్లీ ఫ్యాక్షనిజం పురుడుపోసుకుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం మూడు జిల్లాల్లో ఆరు హత్యలు జరగడం కలకలం రేపుతోంది.

  • Share this:
    ఏపీలో మళ్లీ రాజకీయ కక్షలు.. పాత పగలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్‌ మరోమారు పడగ విప్పింది. మొన్న కడప జిల్లా, నిన్న కర్నూలు జిల్లా, నేడు అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పాత కక్షలు చెలరేగాయి. మొత్తం మూడు జిల్లాలో ఆరుగురు దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. పూర్తిగా మరుగున పడిందనుకున్న ఫ్యాక్షన్‌ రక్కసికి ఈ హత్యలతో మళ్లీ ప్రాణం పోసుకుంది. మూడు జిల్లాల్లో హత్యలకు పాత కక్షలే కారణం కావడం భయపెడుతోంది. మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయా.. ఆ కక్షలు కొనసాగితే రక్త చరిత్ర తప్పదా అనే అనుమాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిని అరికట్టకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది.

    తాజాగా అనంతలో మరోసారి వర్గ కక్షలు భగ్గుమన్నాయి. ఫ్యాక్షన్‌ రక్కసికి ఇద్దరు బలయ్యారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అయితే భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్, నారాయణప్పలను దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. విషయం తెలిసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

    ఇదీ చదవండి: గ్రీన్ జోన్ గా తిరుమల.. వారందరికీ గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే

    నిన్న కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి ప్రత్యర్థుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరిపై మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌విత్‌ 149) కింద కేసు నమోదు చేశారు.
    Published by:Nagesh Paina
    First published: