Home /News /andhra-pradesh /

TENSION SITUATION IN RAMATHIRTHAM TEMPLE FOUNDATION STONE EX MINSTER ASHOKGAJAPATI RAJU PROTEST NGS VZM

Ramathirtham: రామతీర్థంలో శంకుస్థాపనలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన అశోక్ గజపతి రాజు

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత

Ramthirtham: రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన ఏడాది తరువాత.. ఆలయ పునర్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేస్తోంది. అయితే ఈ సందర్బంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజును అడ్డుకోవడంతో ఆయన అక్కడే ఆందోళనకు దిగారు..

ఇంకా చదవండి ...
    Ramathirtham:   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఒకటి రామతీర్థం (Ramatirtham)లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయనగరం (Vizianagaram) రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. రామాల‌య శంకుస్థాప‌న జ‌రుగుతున్న స‌మయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతి రాజుకు (Ashok Gajapati Raju) ఊహించ‌ని అవమానం జ‌రిగింది.  ఆయన్ను కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లం పల్లి కొట్ట నివ్వకుండా ర‌చ్చ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు.. ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు పూసపాటి అశోక్ గజపతి రాజు.

    ఈ సంద‌ర్భంగా.. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ…  ఆలయ ధర్మకర్తనైన తనకు చెప్పకుండా శంకుస్థాపన ఏంటి అని అశోక్ గజనతి రాజు అధికారులను నిలదీశారు.  విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆధారాలు తారుమారు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఎందుకు దుండగులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆలయానికి విరాళం ఇస్తే తిరిగి తన మొహం మీద కొట్టారని.. భక్తులు ఇచ్చే విరాళాలను తిరిస్కరించే అధికారం మీకెక్కడిది అని ఆయన అధికారులను నిలదీశారు..

    ఇదీ చదవండి : ఆంధ్రా కాశ్మీర్ అందాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాంతాలను చూస్తారా? మీ కోసమే ఈ ప్యాకేజ్.. టూర్ ను ఇలా ప్లాన్ చేసుకోండి

    ఇది ప్రభుత్వ కార్యక్రమం కానే కాదు అన్నారు అశోక్ గజతి రాజు.. తమ పూర్వీకులు 400 సంవత్సారా క్రితం నిర్మించిన ఆలయం ఇది అని గుర్తు చేశారు. ఏ కార్యక్రమానికి అయినా ఆనవాయితీ ఉంటుందన్నారు.    తాను  ప్రభుత్వానికి 7 ప్రశ్నలు అడుగుతున్నాను వాటిని ఇండోమెంట్ ఉన్నతాధికారులకు పోస్టులో పంపిస్తాను అన్నారు. ఇప్పటి వరకు 115 వరకు దేవాలయ ఘటనలు జరిగాయి ఏ రోజు వాటి మీద ఎందుకు ప్రభుత్వం దర్యాప్తు చేయలేదని నిలదీశారు. ప్రశ్నిస్తే తనపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : మిసెస్‌ ఇండియా రేసులో సిక్కోలు మహిళ.. గెలిపించాలి అంటే ఇలా ఓటు వేయొచ్చు..

    ప్రభుత్వం అధికారుల తీరుకు నిరసగా ఆయన అక్కడే బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు ఆయన్ను  అక్కడ నుంచి లేపే ప్రయత్నం చేశారు. దీంతో అశోక్ గజపతి రాజు ప్రతిఘటించారు. వెంటనే ఆయనకు వెనక్కు నెట్టేయడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తన అనుచరుల తో పాటు.. అశోక్ గజపతి రాజు అక్కడే కూర్చుకున్నారు.

    ఇదీ చదవండి : జగన్ అన్నపై షర్మిలకు అంత కోపమా..? మొన్న రాఖీ కట్టలేదు.. నేడు విషెస్ చెప్పలేదు? కారణం ఏంటంటే?

    ఏడాది క్రితం అంటే గతేడాది డిసెంబర్ 28వ తేదీన రాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడిన దుండగులు.. శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అప్పుడది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించి.. ధ్వంసమై విగ్రహం స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో పాటు.. ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మూడు కోట్ల నిధులతో ఈ రామాలయాన్ని నిర్మించనున్నారు. పూర్తి రాతి కట్టడంతో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, వంటశాల మెట్ల మార్గం ఆధునికీకరణ, కోనేరును అభివృద్ధి చేయనున్నారు అధికారులు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ramatemple, Vizianagaram

    తదుపరి వార్తలు