Home /News /andhra-pradesh /

TENSION SITUATION IN MANSAS TRUST ONCE AGAIN AP GOVERNMENT FOCUS ON ASHOK GAJAPATI RAJU LANDS NGS VZM

Mansas: మాన్సాస్ లో మరో వివాదం.. వదల బొమ్మాలి అంటున్న ఏపీ సర్కార్

మాన్సాస్ లో మరో వివాదం

మాన్సాస్ లో మరో వివాదం

Mansas Trust: ఆంధ్రప్రదేశ్ లో అశోక్ గజపతి రాజు వర్సెస్ ఏపీ ప్రభుత్వం వార్ కొనసాగుతోంది. ఓ వైపు కేసులు.. మరోవైపు ఆలయాల్లో అడ్డంకులతో మాజీ కేంద్రమంత్రికి వరుస షాక్ లు ఇస్తోంది సర్కార్.. తాజాగా మాన్ సాస్ భూములపై ఫోకస్ చేసింది..

  Ashok Gajapati  Raju Vs AP Government:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాజీ కేంద్ర మత్రి అశోక్ గజపతి రాజు (Ashok Gajapati Raju) -వైసీపీ ప్రభుత్వానికి  (YCP Government) మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా లేదు. తాజాగా మాన్సాస్  లో మరో వివాదం తెరపైకి వచ్చింది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ (Viziangaram Municipal officials) అధికారులు, స్ధానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి (MLA kolagata Veerabadhra Swamy) అత్యుత్సాహం ప్రదర్శించారు. స్ధానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలోనే.. ఆయన సూచనలతో.. మాన్సాస్ భూముల్లో కొలతలు తీయడం, కార్పొరేషన్ అవసరాల కోసం అప్పగించాలని కోరడం చర్చనీయాంశమైంది. దీంతో మాన్సాస్ భూములపై అధికార పార్టీ నాయకుల కన్ను పడిందా అన్న చర్చ జిల్లా కేంద్రంలో జరుగుతోంది. పార్కుల నిర్మాణం, పార్కింగ్ ప్లేస్ లను అభివ్ళద్దిచేయనున్నామని, కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా కొలతలు తీసే అధికారం ఉందని టౌన్ ప్లానింగ్ అధికారులు అనడం కొసమెరుపు.

  ఇటీవలి కాలంలో ప్రభుత్వం, మాన్సాస్ ట్రస్ట్ ల మధ్య వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. ట్రస్ట్ చైర్మన్ తొలగింపు వివాదం నుండి జీతాల వరకూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సాక్షాత్తూ ఎమ్మెల్యే వచ్చి కోట్లాది రూపాయల విలువైన మాన్సాస్ స్థలాలను పరిశీలించి కొలతలు తీయించడం.. స్థలాన్ని కార్పొరేషన్ కు అప్పగించాలని ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

  ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల నాటికి పవన్ తో టీడీపీ పొత్తు.. లవ్ స్టోరీ చెప్పిన చంద్రబాబు

  విజయనగరం పట్టణంలోని కోటకు ప్రధాన ద్వారం కు కుడివైపున ప్రైవేటు స్దలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే.. మరోవైపున ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్ధలం ఉంది. అది కబ్జాకు గురి కాకుండా గత ప్రభుత్వ హయాంలో మాన్సాస్ నిధులతో రైలింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్థలంపైనే తాజాగా ప్రజా ప్రతినిధులు కన్నేశారని తెలుస్తోంది. అక్కడ పార్కు నిర్మాణం చేపడతామంటూ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం స్థల పరిశీలన చేశారు. కార్పొరేషన్‌ కమీషనర్ సహా ఇతర సిబ్బందితో కొలతలు తీయించారు.

  ఇదీ చదవండి : సంక్రాంతికి షాక్ ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ.. సజ్జనార్ ట్వీట్ తో పోలుస్తూ ట్రోలింగ్

  మాన్సాస్ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మాన్సాస్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి డి.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అక్కడే ఉన్న ఎమ్మెల్యే సహా కమీషనర్ తో ఏం చేస్తున్నారని విషయం ఆరా తీసారు. ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ ఈ స్థలంలో పార్కు నిర్మాణానికి ప్రతిపాదించామని.. స్థలాన్ని కార్పొరేషన్‌కు అప్పగించాలని ఆదేశించారు. దీనిపై ఈవో మాట్లాడుతూ అక్కడ పార్కు నిర్మాణం చేపట్టాలంటే మాన్సాస్‌ ట్రస్ట్ తో పాటు ఎండోమెంట్‌ కమిషనర్‌ అనుమతులు అవసరమని చెప్పారు.

  ఇదీ చదవండి : కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు.. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న గొట్టం కాజా ప్రత్యేకతలు ఇవే..

  ప్రభుత్వానికి నివేదించి అనుమతులు తీసుకోవాలన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎవరు అడ్డువస్తారో చూద్దాం’ అంటూ ఉన్నఫళంగా వెళ్లిపోయారు.  ఉదయం 6 గంటల సమయంలో పెద్దచెరువు పక్కన ఉన్న రామానాయుడు రోడ్డులో సర్వే నెంబర్ 685 లో మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన మరో స్ధలంలో కూడా భూమిని చదును చేయడం, అక్కడ ఉన్న డెబ్రిస్ ను వేరే చోటుకు తరలించడం మొదలెట్టారు. జేసీబీలు, లారీలతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పనులు జరిగాయి.

  ఇదీ చదవండి : ప్రాక్టికల్ గా ఆలోచించండి.. మెరుగైన పీఆర్సీ ఇస్తాం.. ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్

  ఈ విషయం తెలుసుకున్న మాన్సాస్ సిబ్బంది మరోసారి అక్కడకు వెళ్లి, పనులను అడ్డుకున్నారు. వెంటనే మాన్సాస్ ఈవో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసారు. మాన్సాస్‌ స్థలాల విషయంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్కు నిర్మాణం చేపట్టడం, పార్కింగ్ ప్రదేశాలను డెవలప్ చేయడం కోసం ప్రతిపాదించటాన్ని ఈవో వ్యతిరేకించారు. ఇందుకోసం ఎవరినీ సంప్రదించలేదని, చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా ట్రస్టు స్థలానికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

  ఇదీ చదవండి: ఏపీలో కొత్త ర‌కం పురుగు టెన్షన్! రైతులకు నిద్ర కరువు

  ఈ వివాదం రచ్చకెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మాన్సాస్‌ ట్రస్టుపై కక్షపూరిత చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి. దేవదాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే అశోక్‌ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల రామతీర్థం బోడికొండపై ఆలయ శంకుస్థాపన సందర్భంలో వీరిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే.

  ఇదీ చదవండి: వార్నింగ్ ఇస్తారా..? బుజ్జగిస్తారా..? చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

  ప్రస్తుతం ఈ స్థల వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఎమ్మెల్యేనే దగ్గరుండీ మాన్సాస్ స్ధలాలలో కొలతలు తీయించడంపై మండిపడుతున్నారు. ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజుకు తెలియకుండా ఎలా కార్పొరేషన్అధికారులు ఇలాంటి వ్యవహారాలు చేపడతారంటూ ప్రశ్నిస్తున్నారు. మాన్సాస్ అధికారులు సైతం.. తమ స్ధలం లోకి మున్సిపల్ అధికారులు, సిబ్బంది చొరబడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలకు సమాయత్తం అవుతున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vizianagaram

  తదుపరి వార్తలు