TENSION SITUATION IN ANDHRA PRADESH SOME PEPOLE DESTROYED NTR STATUE IN TDP FOLLOWERS PROTEST GUNTURU NGS GNT
NTR Statue: ఏపీలో ఉద్రిక్తత.. పట్టపగలే ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. దుండగుడి అరెస్ట్ కు టీడీపీ డిమాండ్
ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంతో టీడీపీ నేతల ఆందోళన.. పోలీసుల అరెస్ట్
NTR Statue: ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసానికి బ్రేకులు పడడం లేదు. ఓ వైపు దేవుడి విగ్రహాల విధ్వంసం కొనసాగుతుండగానే.. మరోవైపు ప్రముఖ నేతల విగ్రహాల ధ్వంసం కూడా కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్ట పగలే ధ్వంసం చేశారు కొందరు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కఠినంగా శిక్షించాలని డీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
NTR Statue: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం విగ్రహాల ధ్వంసం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు దేవడు విగ్రహాలను వదలడం లేదు. ఎక్కడిక్కడ ధ్వంసం చేస్తూనే ఉన్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖుల విగ్రహాలను కూడా దుండగలువదలడం లేదు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statue) ధ్వంసం చేయడాని ఓ వ్యక్తి ప్రయత్నించడం.. అది కూడా పట్టపగలే కావడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా (Guntur District) దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. ఇది దారుణమని ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) చెప్పారు. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని రామకృష్ణ చెప్పారు. కొందరి వైసీపీ నేతల డైరక్షన్ లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ ఈ విషయాన్ని తేలికగా తీసుకోరని హెచ్చరించారు నందమూరి రామకృష్ణ
విగ్రహ ధ్వంసం విషయం తెలియగానే టీడీపీ నేతలు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరే ధర్నా చేశారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది..
కేవలం రాజకీయ నేతల విగ్రహాలే కాదు.. దేవుడి విగ్రహాల విధ్వంసానికి కూడా బ్రేకులు పడడం లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నా.. విగ్రహాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం విజయనరం జిల్లాలో ఆంజనేయ స్వామి చేతులను ధ్వంసం చేశారు కొందరు దుండగులు. పార్వతీపురం పట్టణంలోని బెలగాం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముఖద్వారం పై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చేతులను ఆకతాయిలు విరగ్గొట్టారు.
ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీలో విగ్రహాల ధ్వంసం, హుండీలను కొల్లగొట్టడం లాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. అంతర్వేది రధం దగ్ధం నుండి, విజయవాడ దుర్గ గుడిలో మూడు సింహాల చోరీ, రామతీర్ధంలోని రాముని విగ్రహం ధ్వంసం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాల్లో ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు రాజకీయ ప్రముఖుల విగ్రహాల ధ్వంసం కూడా కొనసాగుతూనే ఉంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.