TENSION IN PALNADU FORMER MINISTER AND TWO TDP MPS ARRESTED MK
పల్నాడులో టెన్షన్: మాజీ మంత్రి, ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్..!
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు హౌస్ అరెస్టు
పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం పల్నాడులో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమన్నారు.
టీడీపీ చేపట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమం వేడి ప్రకాశం జిల్లాలోనూ కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపుతో.. బుధవారం గుంటూరు జిల్లా ఆత్మకూరులో పాల్గొనే అవకాశం ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, ఎం. అశోక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని నేతలకు తెలిపారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా సత్తెన పల్లిలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు కార్యక్రమం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 17 మంది టీడీపీ నేతలకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు బైండోవర్ నోటీసలు ఇచ్చారు.
ఇదిలా ఉంటే పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం పల్నాడులో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమన్నారు. పల్నాడులో ర్యాలీలు నిర్వహించాలనుకొంటే అనుమతి తప్పనిసరన్నారు. ప్రస్తుతం పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.