Home /News /andhra-pradesh /

TENSION ERUPTS OVER PARENTS CONCERN NEAR STUDENT GURUKUL SCHOOL AFTER TEACHER HACKED TO DEATH IN SRIKAKULAM DISTRICT SNR VZM

తరగతి గదిలో ప్రాణాలు తీసుకున్న పదో తరగతి విద్యార్ధి..ఉపాధ్యాయుడే కారణమంటూ పేరెంట్స్ ధర్న

STUDENT SUICIDE

STUDENT SUICIDE

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఓ విద్యార్ధి సూసైడ్ ఘటన స్థానికంగా టెన్షన్‌ను క్రియేట్ చేసింది. ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని టీచర్‌ అందరి ముందు కొట్టడం వల్లే ప్రాణాలు తీసుకున్నాడని పేరెంట్స్‌ ధర్నాకు దిగారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
పరీక్షలు సరిగా రాయలేదని ఉపాధ్యాయుడు అవమానించాడని ఓ విద్యార్ధి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడడంతో.. మంగళవారం ఉదయం స్కూల్ వద్ద ఉద్రిక్తత (Tension)చోటుచేసుకుంది. తమ కొడుకు ప్రాణాలు తీసుకోవడానికి కారణమై ఉపాధ్యాయుడ్ని తమకు అప్పగించాలంటూ పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకుళం జిల్లా ఎచ్చెర్ల (Etcherla)మండలం ఎస్ఎం పురం(s.m puram)లోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల(Gurukul school)లో పదవ తరగతి చదువుతున్న కొంచాడ వంశీ (Konchada vamsi)అనే విద్యార్థి సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో జవాబులు సరిగా రాయలేదని ఉపాధ్యాయుడు తోటి విద్యార్ధుల ముందు మందలించడంతో.. మనస్తాపం చెందిన విద్యార్ధి వంశీ తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంతకవిటి మండలం, మెట్టువలస గ్రామానికి చెందిన కొంచాడ వంశీ(15) ఎస్.ఎం.పురంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల(Gurukul school)లో చదువుతున్నాడు. బాగానే చదివే వంశీ రెండ్రోజుల క్రితం నిర్వహించిన హిందీ  పరీక్ష సరిగా రాయలేకపోయాడు. ఇచ్చిన  ప్రశ్న పత్రానికి రెండు జవాబు పత్రాలు జతచేసి పెట్టాడు. దీంతో హిందీ ఉపాధ్యాయుడు (Hindi teacher)జ్షానేశ్వరరావు (Gnaneshwar rao)వంశీని మందలించాడు. జరిగిన విషయాన్ని ప్రిన్సిపల్ కి చెబుతానని బెదిరించిన హిందీ ఉపాధ్యాయుడు మొత్తం విషయాన్ని ప్రిన్సిపల్ కు చెప్పాడు. మిగిలిన స్టూడెంట్స్‌ ముందు అవమానపరచడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అందరి స్టూడెంట్స్‌తో కాకుండా గురుకుల పాఠశాలలో ఉండే ఓ ఉపాధ్యాయుడితో పాటు పడుకునే వంశీ సోమవారం రాత్రి అలాగే పడుకున్నాడు. ఉదయం  5గంటల సమయంలో ఉపాధ్యాయుడు లేచి చూడగా పక్కన లేకపోవడంతో తరగతి గదిలో వెదికాడు. అక్కడ వంశీ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించడంతో విషయాన్ని ప్రిన్సిపల్‌తో పాటు మిగిలిన ఉపాద్యాయులకు తెలియజేశాడు. వాళ్లు స్కూల్‌కి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంశీ మ్ళతదేహాన్ని కిందకు దించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

మృతదేహంతో స్కూల్‌ దగ్గర ధర్నా..
విషయం తెలుసుకొని స్కూల్ కు చేరుకున్న తల్లిదండ్రులు తమ కొడుకు వంశీ మ్ళతదేహాన్ని చూసి కుమిలిపోయారు.  బాగా చదివే కొడుకు విగత జీవిగా మారడంతో బోరున విలపించారు. జరిగిన విషయాన్ని తోటి విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు.. ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులను నిలదీసారు. తన కొడుకును కొట్టడమే కాక స్కూల్‌లో తోటి విద్యార్ధుల ముందు అవమానించిన హిందీ ఉపాధ్యాయుడు కనిపించకపించకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. తమకు హిందీ ఉపాధ్యాయుడిని అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మరణానికి కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్..
పాఠశాల ప్రిన్సిపాల్ తో ఉపాద్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, తమకు అప్పగించాలని, లేనిపక్షంలో తమ కొడుకు మ్ళతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు.. వంశీ తల్లిదండ్రులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసారు. దిశా డీఎస్పీ వాసుదేవరావు జరిగిన విషయంపై విద్యార్ధులను విచారించారు. ఉపాధ్యాయుడు కొట్టడం, అవమానించడంతోనే వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్ధులు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. విద్యార్ధి వంశీని కొట్టిన ఉపాద్యాయుడు స్ధానిక రాజకీయ నేతల అండదండలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మృతుని బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై పోలీసులు వంశీ తల్లిదండ్రులు, బంధువులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్‌ సమక్షంలోనే మాట్లాడి, బాధితులకు న్యాయం చేస్తామని, భరోసా ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. తల్లిదండ్రులు హిందీ ఉపాధ్యాయుడుపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హిందీ ఉపాధ్యాయుడు జ్ఠానేశ్వరరావుకు అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చేపట్టారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Srikakulam, Student suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు