Andhra Pradesh: ఇన్​కం​ట్యాక్స్​ కడుతున్న పదేళ్ల కొడుకు.. అవాక్కయిన తల్లిదండ్రులు

ప్రతీకాత్మక చిత్రం

కుషల్‌ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఎలాంటి ఆదాయమూ లేదు. కానీ, ఇతనికి 9.80 ఎకరాల భూమి ఉన్నట్టు, రూ.1,200 కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు, వేలాది రూపాయలు ఇన్‌కంట్యాక్స్‌ రిటన్స్‌ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వ సిబ్బంది రికార్డుల్లో ఉంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా.. అప్పట్లో రాజులు ఏలిన మహానగరం.. ఇప్పటికీ అక్కడ కొద్దో గొప్పో రాజవంశస్తులూ ఉన్నారు. అయితే అక్కడ ఉండే వాళ్లంతా ధనవంతులైతే కాదు.. ఇది తెలుసులే అనుకుంటున్నారా?..  ఎవరికెరుక.. పదేళ్ల బాలుడు కూడా లక్షాధికారిగా ఉండొచ్చు.. అవును అక్కడో బాలుడు లక్షాధికారి అంట. పదెకరాలు సంపాదించాడు కూడా. అంతేనా ఇన్​కంట్యాక్స్​ కూడా కడుతున్నాడట. ట్విస్టు ఏంటంటే... ఆ పిల్లాడికి అంత ఆస్తి ఉన్నట్లు అతడికే తెలియదు. అంతేకాదు ఐటీ రిటర్నులు కడుతున్నట్లు కూడా తెలియదు. ఓహో ఇదేంది.. కుడి చేతితో కట్టేది ఎడమ చేతికి కూడా తెలియకూడదని అలా అనుకుంటున్నాడు అనుకుంటే పాలిటిక్స్​లో కాలేసినట్లే.. నిజంగా అతనికి తెలియదు.. ఇదంతా ఒకెత్తయితే అంతటి రిచ్​ కిడ్​కి పెద్ద ఇల్లే ఉండొచ్చని అధికారులు అనుకున్నారు. ఈ ఆస్తులు, హోదాను ఆధారం చేసుకున్న అధికార యంత్రాంగం అతని తల్లి అకౌంట్‌లో పడాల్సిన అమ్మఒడి పథకాన్ని ఆపేశారు. జగనన్న చేయూత నిలిచిపోయింది. అన్నయ్యకు రావాల్సిన వసతి దీవెనకు బ్రేక్‌ వేశారు. తాజాగా తెల్లరేషన్‌కార్డు తొలగింపునకు రంగం సిద్ధమైంది. కారణం తెలుసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లిన తల్లిదండ్రులకు కళ్లు బైర్లు కమ్మే సమాచారం తెలిసింది. పదేళ్ల తమ కుమారుడు కుషల్​ ధనవంతుడని రికార్డుల్లో ఉంది. దీంతో తమ బిడ్డ ఐదో తరగతిలోనే ఇంత ధనవంతుడెలా అయ్యాడో ఆ దంపతులకు అర్థం కాలేదు. ఇది ఎలా సాధ్యమవుతుందో సచివాలయ సిబ్బందికి, వారిని పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగానికే తెలుసు. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం..

  వలసవెళ్లిన కుటుంబం..
  ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ, సాంబయ్యపాలేనికి చెందిన కల్లింపూడి శ్రీనివాసరావు, రమణి దంపతుల కుమారుడే ఈ కుషల్​(10). కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 2.78 ఎకరాల మెట్టభూమి ఉంది. పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడం, ఇతర పనులు కూడా స్థానికంగా దొరక్కపోవడంతో పొట్టచేత పట్టుకుని పిల్లాపాపలతో శ్రీనివాసరావు విశాఖపట్నం వెళ్లాడు. నెలకు పదివేల వేతనానికి పనిచేస్తున్నాడు. అయినా జీతం ఎటూ సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడి ఇంటర్‌ పూర్తయింది. చిన్నవాడు కుషల్‌ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఎలాంటి ఆదాయమూ లేదు. కానీ, ఇతనికి 9.80 ఎకరాల భూమి ఉన్నట్టు, రూ.1,200 కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు, వేలాది రూపాయలు ఇన్‌కంట్యాక్స్‌ రిటన్స్‌ చెల్లిస్తున్నట్లు ప్రభుత్వ సిబ్బంది రికార్డుల్లో పొరపాటున నమోదు చేశారట.  శ్రీనివాసరావు మధ్యతరగతి కుటుంబం కావడంతో గతంలో జగన్ ప్రభుత్వం అందజేస్తున్న అమ్మఒడి, చేయూత పథకాలు అందుకున్నాడు. అయితే రికార్డుల్లో కుమారుడికి 9.8 ఎకరాల భూమి ఉన్నట్లు, ఇన్​కంట్యాక్స్​ కూడా చెల్లిస్తున్నట్లు నమోదవడంతో వారికి రావాల్సిన ఈ అమ్మ ఒడి, చేయూత పథకాలు ఆపేశారు ప్రభుత్వ అధికారులు. అంతేనా పెద్దకుమారుడికి విద్యాదీవెన పథకమూ వర్తించలేదు. భవిష్యత్తులో విద్యాదీవెన వర్తించబోదని, రేషన్‌కార్డు కూడా రద్దవుతుందని తెలిసిన ఆ కుటుంబం సచివాలయ అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ ఫలితం దక్కలేదట. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో ఓ మూడు సార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందించలేదట. ఇదే విషయమై ఆరా తీయగా ఇటువంటి కేసులు జిల్లాలో 5999 ఉన్నట్లు తెలిసింది.
  Published by:Prabhakar Vaddi
  First published: