గజగజ వణికిస్తున్న చలి.. గడ్డకడుతున్న శరీరం..

Weather News : సాయంత్రం కాగానే చలి చెవ్వుల్లోకి చొచ్చుకుపోతోంది. 6 దాటిందంటే ఒంటి మీద ష్వెటర్ లేకుండా బయట కాలు పెట్టాలంటే భయం అవుతోంది. ఆ చలికి పెయ్యి పట్టన పగులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలు గజగజ వణుకుతున్నారు.

news18-telugu
Updated: November 27, 2019, 7:51 AM IST
గజగజ వణికిస్తున్న చలి.. గడ్డకడుతున్న శరీరం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాయంత్రం కాగానే చలి చెవ్వుల్లోకి చొచ్చుకుపోతోంది. 6 దాటిందంటే ఒంటి మీద ష్వెటర్ లేకుండా బయట కాలు పెట్టాలంటే భయం అవుతోంది. ఆ చలికి పెయ్యి పట్టన పగులుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలు గజగజ వణుకుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాస్తవానికి నవంబరు రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాల్సి ఉండగా, అయితే.. వర్షాలు ఎక్కువ రోజులు పడటంతో చలి లేటుగా వచ్చిందని వాతావరణ అధికారులు వెల్లడించారు. కాగా, రాబోయే 24 గంటల్లో కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని తెలిపారు. తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుతున్నాయని వివరించారు. దీంతో క్రమంగా చలి పెరుగుతోందన్నారు. మరో రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

సాధారణంగా వర్షాలు ఎక్కువ పడిన సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల ప్రజలకు చలితో తిప్పలు తప్పవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>